శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 19 జులై 2017 (22:36 IST)

రవితేజకు డ్రగ్స్ ఇస్తూ పూరీ జగన్నాథ్... ఫోటో వుందా?(వీడియో)

హీరో రవితేజకు, మరణించిన ఆయన సోదరుడు భరత్ కు దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ ఇస్తున్నట్లుగా ఓ ఫోటో కెల్విన్ కెమేరాలో లభించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను చూసిన తర్వాత పూరీ షాక్ తిన్నట్లు సమాచారం. మరోవైపు కెల్విన్ తో పూరీగా వున్న సంబంధాలన్నీ చాలా పగడ్బందీగ

హీరో రవితేజకు, మరణించిన ఆయన సోదరుడు భరత్ కు దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ ఇస్తున్నట్లుగా ఓ ఫోటో కెల్విన్ కెమేరాలో లభించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను చూసిన తర్వాత పూరీ షాక్ తిన్నట్లు సమాచారం. మరోవైపు కెల్విన్ తో పూరీగా వున్న సంబంధాలన్నీ చాలా పగడ్బందీగా వీడియోలతో సహా సిట్ అధికారుల వద్ద వున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా పూరీని లోతుగా ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు చెపుతున్నారు. 
 
ఇకపోతే ఇవాల్టికి పూరీ జగన్నాథ్ తో విచారణ ముగిసిందని అధికారులు వెల్లడించారు. విచారణకు పూరీ జగన్నాథ్ సహకరించారనీ, రేపు శ్యామ్ కె. నాయుడిని విచారిస్తామని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు విచారణ ముగిసిన అనంతరం పూరీ జగన్నాథ్ మీడియాతో మాట్లాడుకుండా వెళ్లిపోయారు. ఆయన ఇంటి వద్ద కూడా ఎవ్వరినీ అనుమతించలేదు.