శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 జులై 2017 (16:21 IST)

డ్రగ్స్ కేసు... నా వెంట పేరెంట్స్ రావట్లేదు... న్యాయవాదిని తీసుకెళ్తా... హైకోర్టుకి చార్మి(వీడియో)

డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు సినీ సెలబ్రిటీలను సిట్ విచారించింది. ఇవాళ హీరో నవదీప్‌ను విచారిస్తోంది. ఇదిలావుండగా నటి చార్మి సిట్ విచారణకు సహకరిస్తానంటూనే హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలను సేక

డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు సినీ సెలబ్రిటీలను సిట్ విచారించింది. ఇవాళ హీరో నవదీప్‌ను విచారిస్తోంది. ఇదిలావుండగా నటి చార్మి సిట్ విచారణకు సహకరిస్తానంటూనే హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలను సేకరించకూడదని ఆమె తరపు న్యాయవాది పిటీషన్లో పేర్కొన్నారు. 
 
ఇంకా చార్మి పిటీషన్లో... తను ఇప్పటివరకూ దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోనూ నటించానని తెలిపింది. తను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాననీ, ఐతే సిట్ జరుపుతున్న విచారణ తీరు అభ్యంతరకరంగా వుందంటూ ఆమె పేర్కొన్నారు. ఈ కేసు కారణంగా తన కెరీర్‌కు డ్యామేజ్ అయ్యే అవకాశం వున్నదంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అందువల్ల తనను విచారించే సమయంలో తన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలంటూ ఆమె పిటీషన్లో పేర్కొన్నారు. చార్మి పిటీషన్ నేపధ్యంలో సిట్ అధికారులు ప్రభుత్వ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. వారి సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైరు చార్మి పిటీషన్ మంగళవారం నాడు కోర్టు విచారణకు రానుంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వీడియోలో చూడండి..