ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (09:56 IST)

శ్రీదేవి వెండితెర సోదరి కన్నుమూత ... ఎవరామె?

వెండితెర అందాల నటి శ్రీదేవి వెండితెర సోదరిగా గుర్తింపు పొందిన సుజాతా కుమార్ ఇకలేరు. ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సుచిత్రా కృష్ణమూర్తి తన ఫేస్‌బుక్ అకౌంట్‌ ద్వా

వెండితెర అందాల నటి శ్రీదేవి వెండితెర సోదరిగా గుర్తింపు పొందిన సుజాతా కుమార్ ఇకలేరు. ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సుచిత్రా కృష్ణమూర్తి తన ఫేస్‌బుక్ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు.
 
'ఇంగ్లీష్ - వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి సోదరిగా సుజాతా కుమార్ నటించారు. గతకొంతకాలంగా ఆమె కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె ఆదివారం రాత్రి చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కపూర్ మాజీ భార్య, సుజాత సోదరి సుచిత్రా కృష్ణమూర్తి వెల్లడించారు. 
 
సుచిత్రా కృష్ణమూర్తి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో 'సుజాత ఆగస్టు 19, 2018న రాత్రి 11. 26 నిముషాలకు కన్నుమూశారు. ఇకపై జీవితం మునుపటి మాదిరిగా ఉండదు. ఈరోజు (ఆగస్టు 20) ఉదయం 11 గంటలకు సుజాత అంతిమ సంస్కారాలను ముంబైలోని విలే పార్లేలోగల శ్మశాన వాటికలో నిర్వహిస్తాం' అని వెల్లడించారు.