సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మే 2024 (16:43 IST)

గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సోష‌ల్ డ్రామాగా యుఫోరియా త్వరలో షూటింగ్

Euphoria logo,  Guna Shekhar
Euphoria logo, Guna Shekhar
సమంత తో శాకుంతలం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో చిత్రం చేస్తున్నట్లు దర్శకుడు గుణ శేఖ‌ర్ ప్రకటించారు. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నుంది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్  బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది.
 
 ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.