శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 18 మే 2017 (08:15 IST)

దేశవ్యాప్తంగా బాహుబలి-2 పైరసీ.. 6 లక్షలపైగా డౌన్‌లోడ్‌లు.. అయినా తగ్గని కలెక్షన్లు. ఎలా?

అయితే ఇంత విస్తృతంగా పైరసీ కాపీలు బయటికి వచ్చినప్పటికీ బాహుబలి-2 సినిమా భారీ కలెక్షన్లకు విఘాతం కలగలేదంటే దాని డిజిటల్ కంటెంటే కారణం. నేరుగా థియేటర్లో చూస్తే తప్ప బాహుబలి నాణ్యత ను ఆస్వాదించలేమని, పైరసీ ద్వారా మీరు చూసేది అసలు సినిమా నాణ్యతలో పది శాత

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 6 లక్షల పైనే బాహుబలి-2 పైరసీ ఫైల్స్ డౌన్ లోడ్ అయినట్లు సమాచారం. పైరసీ ద్వారా కోట్లు కొట్టేద్దామనుకున్న కేసు బయటపడిన తర్వాత కూడా సెల్‌ఫోన్‌లు, టొరంట్లలో కూడా పైరసీ కాపీలు వచ్చాయి. ప్రస్తుతం బీఎఫ్ఓ-ఎం4, ఇతర ఫార్మాట్లలో ప్రదర్శితమయ్యే వాటిని కూడా ఎన్‌కోడర్స్‌ ద్వారా రీడ్‌చేసి తర్వాత కంటెంట్‌ను మొత్తం కాపీ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎంతగొప్ప సినిమా అయినా...ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాపీ చేయడం పెద్ద కష్టంకాదని తేలిపోయింది. సినిమా ప్రదర్శన ద్వారా వచ్చే సొమ్ముకన్నా... పైరసీ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశపడ్డ యజమానే పైరసీ కేటుగాళ్లకు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అయితే బాహుబలి-2 ఎక్కడ బతికిబట్టకట్టిదంటే సినిమా డిజిటల్ కాపీ పైరసీ కాలేదు. ఎక్కడో ప్రదర్శితమవుతున్న సినిమాను హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డు సి ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. ఎంపీ4 ఫార్మాట్‌లో ఉన్న వీడియో 150 ఎంబీ సైజ్‌ నుంచే నెట్‌లో పెట్టినట్లు కూడా తెలుస్తోంది. బాహుబలి-2 పైరసీ కేసు వెలుగుచూసిన తర్వాత కూడా రెండు సైట్లలో పైరసీ సినిమా ఫైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన బాహుబలి-2 సినిమా పైరసీ బారిన పడకుండా నిర్మాతలు అసాధారణ జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
బాహుబలి-2ను శాటిలైట్‌ సర్వర్‌ ద్వారా నేరుగా ఎన్‌క్రిప్టెడ్‌( సురక్షితమైన) ఫార్మాట్‌లో డిజిటల్‌ రూపంలో థియేటర్లకు పంపించారు. ప్రతి థియేటర్‌కు ఆన్‌లైన్ సర్వర్, డిజిటల్ కీలను పంపిణీ సమయంలోనే అందించారు. డిజిటల్‌ కీని సెట్‌చేసిన తర్వాతే సినిమా ఎన్‌క్రిప్షన్‌ ఫార్మాట్‌ నుంచి సాధారణ పరిస్థితికి మారి హైడెఫినేషన్‌ ఎంపీ4 ఫార్మాట్‌( ఎంపెగ్‌-4)లో ప్రదర్శితమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇది సురక్షితమే. అయితే, సినిమా ప్రదర్శన హక్కులు కొన్నవారే డబ్బుకు కక్కుర్తిపడి బ్లాక్‌మెయిల్‌ లేదా కాపీ వ్యవహారాలకు దిగితే ఇక అంతే సంగతులు. 
 
బాహుబలి-2లో అచ్చం అలాగే జరిగింది. బీహార్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రదర్శితమయ్యే ధియేటర్‌ యజమాని సహకారంతో ప్రొజెక్టర్‌లో ప్రదర్శితమయ్యే సినిమాను హెచ్‌డీఎమ్‌ఐ కన్వర్టర్‌ ద్వారా కాపీ చేశారు. దాన్ని కంప్రెస్‌ చేసి 1.8 నుంచి 3.5 జీబీ సామర్ధ్యంగల ఫైల్స్‌గా రూపొందించారు. ప్రస్తుతం బీఎఫ్ఓ-ఎం4, ఇతర ఫార్మాట్లలో ప్రదర్శితమయ్యే వాటిని కూడా ఎన్‌కోడర్స్‌ ద్వారా రీడ్‌చేసి తర్వాత కంటెంట్‌ను మొత్తం కాపీ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎంతగొప్ప సినిమా అయినా...ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాపీ చేయడం పెద్ద కష్టంకాదని తేలిపోయింది. 
 
అయితే ఇంత విస్తృతంగా పైరసీ కాపీలు బయటికి వచ్చినప్పటికీ బాహుబలి-2 సినిమా భారీ కలెక్షన్లకు విఘాతం కలగలేదంటే దాని డిజిటల్ కంటెంటే కారణం. నేరుగా థియేటర్లో చూస్తే తప్ప బాహుబలి నాణ్యత ను ఆస్వాదించలేమని, పైరసీ ద్వారా మీరు చూసేది అసలు సినిమా నాణ్యతలో పది శాతం మాత్రమేనని చిత్రం విడుదల అయిన రోజునుంచి చూసిన ప్రతి ప్రేక్షకుడూ మౌత్ టాక్ ప్రచారం చేయడంతో చూస్తే థియేటర్లోనే బాహుబలి-2 ని చూడాలన్న పట్టుదల జనంలో బలపడింది. అందుకే మూడువారాల తర్వాత కూడా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ లో బిగ్ స్క్రీన్ పై సినిమా చూద్దామనుకున్న ప్రేక్షకులు ఇప్పటికీ టికెట్లు దొరక్కపోయినప్పటికీ అందులోనే చూడాలన్న ఆసక్తిని చంపుకోవడం లేదు. 
 
ఇది ఒక మనదేశంలోనే కాదు. ప్రపంచంలో బాహుబలి సినిమా విడుదలైన ప్రతి దేశంలోను సినిమానూ చూసిన ప్రేక్షకులు, యువతీ యువకులు ముక్తకంఠంతో దయటేసి బాహుబలి-2ని థియేటర్లోనే చూడంటి అంటూ అభ్యర్థించడం జరిగింది. నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లోని ప్రేక్షకులు కూడా సినిమాకు ఇదే ప్రచారాన్ని ఉద్యమ స్థాయిలో తీసుకుపోయారు. ప్రేక్షకుల్లోని ఈ నిజాయితీ, జనంలో ఒరిజనల్ సినిమానే చూడాలన్న పట్టుదల మాత్రమే బాహుబలి2ని కాపాడింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తే డిజటల్ కంటెట్‌ నాణ్యతను బాహుబలి-2 ఎంత స్పష్టంగా రూపొందించిందో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. చివరకి హైదరాబాద్‌లో విడిగా బాహుబలి-2ని చూసినవారు మరోసాి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోతున్నారు తప్పితే పైరసీ జోలికి పోలేదు. 
 
అందుకే బాహుబలి అద్భుత విజయానికి దోహదపడింది ప్రేక్షకుల పట్టుదల. క్వాలిటీ సినిమాను మాత్రమే చూడాలన్న తపనే బాహుబలి-2 ని కాపాడింది. బాహుబలి అభిమానులే కాదు, చిత్ర నిర్మాతలు కూడా ఆ వాస్తవాన్ని గమనించాలి.