గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (02:04 IST)

మణిరత్నం అడిగినా కట్‌ చేయను అన్నదెవరు.. ఎందుకన్నారు?

భారత చిత్ర పరిశ్రమ మొత్తానికి హీరోయిన్లను అందిస్తున్న ఏకైక ప్రాంతం కేరళ అని అందరికీ తెలుసు. అందం సౌకుమార్యం, గ్లామర్, నటన అన్ని ప్రాంతాల అమ్మాయిలకు ఉండవచ్చేమో కానీ మలయాళీ అమ్మాయిలకు మరో క్వాలిటీ కూడా ఉంది. అదేమిటంటే జుత్తు. నీలి కురుల జుత్తు. చూడగాన

భారత చిత్ర పరిశ్రమ మొత్తానికి హీరోయిన్లను అందిస్తున్న ఏకైక ప్రాంతం కేరళ అని అందరికీ తెలుసు. అందం  సౌకుమార్యం, గ్లామర్, నటన అన్ని ప్రాంతాల అమ్మాయిలకు ఉండవచ్చేమో కానీ మలయాళీ అమ్మాయిలకు మరో క్వాలిటీ కూడా ఉంది. అదేమిటంటే జుత్తు. నీలి కురుల జుత్తు. చూడగానే ఒక్కసారి తాకితే చాలు అనేంత మనోహరమైన జత్తు వారికే సొంతం అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ జుట్టు పట్టులాగా జారిపోతుంటుంది. వారి శరీరం తళతళ మెరిసిపోతుంటుంది. ఆ జుట్టు, ఆ తళతళలతోనే మలయాళీ అమ్మాయిలు దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమనే ఏలుతున్నారు. ఈ జుట్టును పట్టుకునే అది నాకెంతో ఇష్టమని, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకుడు అడిగినా సరే నా జుట్టును మాత్రం కట్ చేయను అంటూ భీషణ శపథం చేసింది మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్.
 
మణిరత్నం కట్ చేయమన్నా నా జుట్టు కట్ చేయను అని అనుపమ ఎప్పుడు బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిందో కానీ అది అంతేవేగంతో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది ఈ విషయాన్ని ఒక చానల్ ఆమె దృష్టికి తీసుకెళ్లి మీ జుత్తు రహస్యమేమిటి, దాని కటింగుకు, మణిరత్నంకు ముడిపెట్టడమేంటి అని ప్రశ్నించినప్పుడు ఆమె గమ్మత్తుగా కొన్ని విషయాలు చె్పింది. అబ్బే. క్యాజువల్‌గా మాట్లాడుతున్నప్పుడు అలా వచ్చేసింది. నేను సీరియస్‌గా జవాబివ్వకున్నా మీడియా దాన్ని సీరియస్ చేసేసింది. మణిరత్నం గారు నిజంగా అడిగితే నేను జుట్టు కట్ చేయను అని చెప్పను. నా క్యారెక్టర్ బాగుంటే జుట్టు కట్ చేయడం గురించి ఆలోచిస్తా అని జబాబిచ్చింది.
 
పైగా మలయాళీ  అమ్మాయిల అందం రహస్యమేమిటి? జుత్తుకు కొబ్బరి రాసుకుంటారు కనుకేనా అనే ప్రశ్నకు సైతం అనుపమా కొంటెగా జవాబిచ్చింది. మా తలతళలకు, నిగనిగలకు కారణం కొబ్బరే కాదు. కేరళ వాతావరణం కూడా అందుకు దోహదం చేస్తోందని చెప్పేసింది. కేరళ వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది పొల్యూషన్‌ తక్కువ. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. మేం తలకి మాత్రమే కాదు.. వంటకి కూడా కొబ్బరి నూనె వాడతాం. మా తళతళలకు కారణం అదే (నవ్వుతూ). నిజానికి నా జుత్తు బాగుండేది. కేరళ నుంచి బయట అడుగుపెట్టనంతవరకూ నో ప్రాబ్లమ్‌. సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాను కదా.. జుత్తు రాలిపోతోంది.
 
ప్రేమమ్ సినిమాలో అటు ఒరిజనల్ మలయాళంలోనూ, తర్వాత నాగ చైతన్యతో తెలుగులోనూ తొలి ప్రేమికురాలి పాత్రలో అనుపమా పరవేశ్వరన్ వెలిగిపోయింది. ఇక అ.ఆ సినిమాలో ఆమె పాత్ర విశ్వరూపమే. యామండీ అనే తెలుగు యాసతో నిఖిల్‌ని, సమంతను అదరగొట్టిన యాక్షన్ ఏమి.. గదిలోకి వచ్చిన ప్రతి మగాడినీ భార్య పవన్ కల్యాణే అనుకుంటుంది అని డైలాగేసి జనాలను పెచ్చెత్తించడంలో కాని అనుపమ స్టేలే వేరు.