శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 4 మే 2017 (09:12 IST)

మోహన్‌బాబు కూడా సలహా ఇచ్చేశారు. పెళ్లెఫ్పుడు ప్రభాస్? ఇకైనా చేసుకోవచ్చుగా?

తెలుగు సినిమారంగంలో అద్వితీయ చిరిత్రను లిఖించుకున్న బాహుబలి2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రభాస్‌ను పట్టుకుని ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివి కావా అంటూ అడిగేశారు. బుధవారం బాహ

తెలుగు సినిమారంగంలో అద్వితీయ చిరిత్రను లిఖించుకున్న బాహుబలి2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రభాస్‌ను పట్టుకుని ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివి కావా అంటూ అడిగేశారు. బుధవారం బాహుబలి ది కంక్లూజన్ చూసిన మోహన్ బాబు పేరుపేరునా బాహుబలి టీమ్‌ను ప్రస్తావిస్తూ హర్షం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ప్రభాస్‌కు పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. 
 
ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ ‘ బావా బాహుబలి.. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తారని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడవై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను.. విజయీభవ’ అంటూ పేర్కొన్నారు.
 
మోహన్ బాబు ఒక మాట అన్నారంటే తర్వాత ఊరుకోరని అందరికీ తెలుసు. పెళ్లి చేసుకో అని మంచి ఉద్దేశంతో సూచన చేసిన మోహన్ ‌బాబు మాటను గౌరవించి అయినా ప్రభాస్ ఈ ఏడు పెళ్లి చేసుకోవలసిందే మరి. అలా కాకుండా ప్రభాస్ సినిమాల పేరుతో బ్యాచులర్‌గానే కొనసాగితే తర్వాత ఎప్పుడైనా ఏదైనా పంక్షన్‌లో కలుసుకునే సందర్భం తటస్థించినప్పుడు మోహన్ బాబు ఎలా దులిపేస్తారో తెలిసిందే కదా. 
 
గతంలో తన కుమారుడి పెళ్లికి రెండు రోజులు ముందుగా రాకుండా బాహుబలి ది బిగినింగ్ షూటింగ్ నుంచి నేరుగా పెళ్లిరోజు ప్రభాస్ కల్యాణమంటపానికి వచ్చినందుకు మోహన్ బాబు ఎంత సీన్ సృష్టించారో తెలిసిందే కదా. ప్రభాస్‌తో మాట్లాడకుండానే అంత దూరం పెట్టేస్తే మంచుమనోజ్ ప్రభాస్‌ను సముదాయించాడు.
 
మోహన్ బాబు మళ్లీ కోపగించుకోకుండా ఉండాలంటే ప్రభాస్ ముగ్గులోకి దిగేయాల్సిందే.. అఖిలాంధ్రప్రేక్షక జనం ముక్త కంఠంతో చెబుతున్నట్లుగా అనుష్కనే పెళ్లిచేసుకుంటే సరిపోతుంది కదా. అనుష్కకు కూడా సమ్మతమైతేనే మరి. బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్, అనుష్క ఎంత సన్నిహితంగా మెలిగారో అందరికీ తెలిసిందే. మరి ఎందుకు ఇంకా ఈ గుంజాటన.