ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (20:56 IST)

#HariHaraVeeraMallu డైలాగ్, ఫోటో లీక్.. వైరల్

Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. పవన్ న‌టిస్తున్న చిత్రాల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక‌టి. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. 
 
పీరియాడిక‌ల్ మూవీగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా వుండటం.. కరోనా ఎఫెక్టుతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. 
 
ఇంతలో క్రిష్ కూడా ఇక టైమ్ వేస్ట్ అని ఇంతలో వేరే సినిమా అనుష్కతో ప్లాన్ చేసేశాడు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు నుంచి ఫోటోతో పాటు డైలాగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ డైలాగ్ ఏంటంటే.. నా మీద కత్తి ఎత్తడం అనే ఆలోచన వచ్చేలోపు.. కత్తి ఎత్తడానికి చెయ్యి వుండదు.. ఆలోచించడానికి తల వుండదు.. అనేదే. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ఎక్స్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.