మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (14:01 IST)

హరిహర వీరమల్లులో జయసుధ కుమారుడు నిహార్ కపూర్

Nihar Kapoor
Nihar Kapoor
సినీయర్ నటి జయసుధకు ఇద్దరు కుమారులు. మొదటి వ్యక్తి నిహార్ కపూర్. ఇటీవలే గ్యాంగ్ స్టర్ గంగరాజ్ లో విలన్ గా నటించాడు. తాజాగా అదే బేనర్ లో చదలవాడ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రికార్డ్ బ్రేక్ సినిమాలో హీరోగా నటించాడు. ఇది స్పోర్ట్ నేపథ్యంలో జరిగే కథ. ఆరడుగులకు పైగా ఎత్తు వుండే నిహార్ కు దర్శకుడి అవ్వాలనే కోరిక వుండేది. అందుకే సినిమాపై పెద్దగా ద్రుష్టి పెట్టలేదట.
 
దర్శకత్వం వహించాలని అన్ని భాగాల్లో డిగ్రీ సంపాదించుకున్నా. అయితే నా లైఫ్ లో క్రికెటర్ అవ్వాలని గోల్ వుండేది.  దాని వల్ల నటుడిగా ఆలస్యమైంది. బాలీవుడ్ లో నా హైట్ కు ఆఫర్లు వచ్చేవి. తెలుగులో నటించాలని మొదటగా గ్యాంగ్ స్టర్ గంగరాజు లో నటించాను. ఇప్పుడు నాకిష్టమైన స్టోర్ట్ నేపథ్యంలో రికార్డ్ బ్రేక్ సినిమాలో  నటించాను. అయితే ఇది కుస్తీ పోటీ కథ. అదేవిధంగా తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహరవీరమల్లులో కీ రోల్ చేస్తున్నా. అది ఏమిటనేది త్వరలో తెలియజేస్తాను అన్నారు.