శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (19:24 IST)

జాంబియాలో బాల‌య్య బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జరిపిన ఫ్యాన్స్

balakrishna
త‌మ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పండుగే. ఎక్క‌డున్నా త‌మ అభిమాన హీరో పుట్టినరోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు అభిమానులు. 
 
జూన్‌10 న‌ట‌సింహ‌ నంద‌మూరి బాల‌కృష్ణ  60వ‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నఆయ‌న అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. అలాగే ప‌లు సంక్షేమ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.
 
దీనిలో భాగంగా జాంబియాలో న‌ట‌సింహ‌ నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు ఆయ‌న ఆభిమానులు. కేక్ క‌ట్ చేసి ఆయ‌న పాట‌ల‌కు డ్యాన్సులు వేస్తూ సెల‌బ్రేట్ చేసుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా జాంబియాలోని కొన్ని అనాథాశ్ర‌మానికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు.