సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 జూన్ 2020 (11:04 IST)

మా బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి: చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ సినిమా షూటింగుల వ్యవహారంలో ఒకవైపు బాలయ్య పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.
 
బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday’ అంటూ చిరు ట్వీట్ చేశారు.