మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (10:23 IST)

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే... నా తొలి హీరో మీరే: జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలయ్య 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 
 
'నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్. మీ 60వ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. జై బాలయ్య' అంటూ ట్వీట్ చేశారు. బాబాయ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ జై బాలయ్య అంటూ పోస్ట్ చేశారు.
 
అలాగే బాలకృష్ణ 60వ బర్త్ డే సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. 60 ఏళ్ళ గత స్మృతులని నేను గుర్తు చేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే బాలకృష్ణ అంటూ చిరు ట్వీట్ చేశారు.
 
ఇకపోతే.. బాలయ్య పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి వేధిస్తుండటంతో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.