సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (19:16 IST)

బాలయ్య వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పోసాని (video)

నందమూరి బాలకృష్ణ ఇటీవల తెలంగాణ సీఏం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిన సినీప్రముఖుల గురించి స్పందిస్తూ... తనని పిలవలేదని.. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మీటింగ్.. భూములు పంచుకోవడం కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదస్పదం అయ్యింది.
 
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. బాలయ్య నిజాయితీపరుడు. డబ్బులు కోసం రాజకీయాల్లోకి రాలేదు అంటూనే బాలయ్యకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ పోసాని ఏమన్నారంటే... త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు.
 
అక్కడ సీఎంగా ఉన్నది ఎన్టీఆర్ కాదు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. వెన్నుపోటు పొడవరు.. పొడుపించుకోరు అన్నారు. అంతటితో ఆగలేదు పోసాని... ఐదేళ్లు కాదు.. మరో పదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. జగనే ముఖ్యమంత్రి అని చెప్పారు.

పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సినీ వర్గాల్లోను హాట్ టాపిక్ అయ్యింది. మరి.. పోసాని వ్యాఖ్యలపై బాలయ్య కానీ.. తెలుగుదేశం తమ్ముళ్లు కానీ.. స్పందిస్తారేమో చూడాలి.