శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 జూన్ 2020 (14:52 IST)

బోయపాటికి షాక్ ఇచ్చిన బాలయ్య, ఇంతకీ ఏమైంది..?

నందమూరి నట సింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహ, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆఖరికి బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ కావడంతో ఇక బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు.
 
ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు కరోనా షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. 
 
ఇదిలా ఉంటే... జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా బోయపాటి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యపై ఫోటో సెషన్ కూడా చేసారు. కొన్ని గెటప్స్ రెడీ చేయించారు. టైటిల్ కూడా ఎనౌన్స్ చేయనున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
 
అయితే... బాలయ్య ఫస్ట్ లుక్ ఇప్పుడు రిలీజ్ చేయద్దు అంటూ బోయపాటికి షాక్ ఇచ్చారట. కరోనా కారణంగా ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని.. కొన్ని రోజులు తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పినట్టు సమాచారం.
 
 బాలయ్య నిర్ణయంతో బోయపాటి డీలాపడ్డారని టాక్ వినిపిస్తోంది. కరోనా కారణంగా స్ర్కిప్ట్‌లో చాలా మార్పులు చేర్పులు చేసారు. ఇప్పుడు స్ర్కిప్ట్ మరింత బాగా వచ్చిందని చెబుతున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దసరాకి కానీ.. సంక్రాంతికి కానీ.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి.. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ సాధిస్తారని ఆశిద్దాం.