గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (15:20 IST)

చిరంజీవిని పరోక్షంగా విమర్శించిన బాలయ్య, ఇంతకీ ఏమన్నాడు..?

దర్శకరత్న దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుండేవారు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్... నుంచి సినీ కార్మికుల వరకు సమస్య వచ్చింది అంటే దాసరి ఇంటి వైపు చూసేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా చిరంజీవి ముందుంటున్నారు.
 
ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వస్తున్నారు. అయితే... షూటింగ్స్ ఆగిపోవడంతో చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసారు. ఈ మీటింగ్‌కి తనని పిలవలేదని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
 
ఇదిలావుంటే... తన పుట్టినరోజు సందర్భంగా న్యూస్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు బాలయ్య. ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. పరోక్షంగా చిరంజీవిని విమర్శించారు. ఇంతకీ ఏమన్నారంటే... నాన్నగారు ఎన్టీరామారావు గారు సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అదో చరిత్ర.
 
ఆయనలా చేయాలనుకుని ప్రయత్నించి సాధించలేకపోయిన వాళ్లు మన ముందు ఉన్నారు కదా అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి అధికారంలోకి రావాలి అనుకున్నారు కానీ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా చిరంజీవిపై పరోక్షంగా బాలయ్య విమర్శలు చేయడం చర్చినీయాంశం అయ్యింది.