శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (14:22 IST)

వాడికెంత బలుపు.. 'బాహుబలి' డైరెక్టర్ ఎవరని ప్రశ్నిస్తాడా? తెలుగు హీరోపై పవన్ హీరోయిన్ ఫైర్

ఓ తెలుగు హీరోపై టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌పై కారాలుమిరియాలు నూరింది. బాహుబలి దర్శకుడు ఎవరని ఆ కుర్ర హీరో ప్రశ్నిస్తాడా అంటూ మండిపడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్నదే కదా మీ ప్రశ్న. పవర్ స్టార్ పవన్ కళ

ఓ తెలుగు హీరోపై టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌పై కారాలుమిరియాలు నూరింది. బాహుబలి దర్శకుడు ఎవరని ఆ కుర్ర హీరో ప్రశ్నిస్తాడా అంటూ మండిపడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్నదే కదా మీ ప్రశ్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నికీషా పటేల్. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నికీషా పటేల్.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని పోస్టులు పెట్టింది. అందులో ఇటీవ‌ల ఓ తెలుగు హీరోను 'బాహుబ‌లి-2: ది కన్‌క్లూజన్' సినిమా చూశావా' అని అడిగాను. దానికి ఆ నటుడు తిరిగి నికీషా ప‌టేల్‌ను 'ఆ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు?' అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడని తెలిపింది. 
 
దానికి తాను చాలా 'ఆశ్చర్యపోయానని, అతనిని చూస్తుంటే అసహ్యమేసిందని, దీనికి సిగ్గుపడాలని' తెలిపింది. అతని పేరును ఉచ్ఛరించాలంటే కూడా చిరాగ్గా ఉందని నికీషా పటేల్ తెలిపింది. కాగా, ఇప్పటికే రాజమౌళిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలంతా అభినందించడంతో నికీషా పటేల్‌తో ఇలా ఎవరు వ్యాఖ్యానించి ఉంటారు? అని టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు.