మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:06 IST)

నమిత జిమ్‌లో వర్కవుట్స్, సూపర్ ఫిజిక్

Acress Namita,zym
నమిత  తన ఫిజిక్ను  అభిమానులకు చూపి ఫిదా అవుతుంది. ఈమెనే కాదు  తనను చూసిన అందరూ అలాగే ఫీల‌వుతున్నందుకు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఈరోజు సోష‌ల్‌మీడియాలో ఆమె సంబ‌ర‌ప‌డుతోంది. త‌ను జిమ్‌లో వున్న ఫొటోను సోష‌ల్‌మీడియాలో పెట్టి అభిమానుల ఫీడ్‌కోసం ఎదురుచూస్తుంది. అందుకు త‌గిన‌ట్లే అది వైర‌ల్ కావ‌డంతో న‌మిత ఆనందానికి హ‌ద్దులు లేవు. త్వ‌ర‌లో మ‌ర‌లా సినిమాల‌లోకి వ‌చ్చేందుకు ఇదంతా చేస్తున్న‌ట్లు చెబుతుంది.

పెండ్లికి ముందు ప‌లు భిన్న‌మైన సినిమాలు పాత్ర‌లు చేసిన న‌మిత ఆ త‌ర్వాత ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంది. తమిళ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొంది.  ఆ తర్వాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కానీ  కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నమిత సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆమె శరీరం భారీగా పెరిగిపోయింది.

ఆమ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌కు వెళితే లావు త‌గ్గాల‌ని నిర్వాహ‌కులు సూచించార‌ట‌. అక్క‌డి అభిమానులు కూడా ఆమెను నాజూగ్గా చూడాల‌నుకుంటున్నార‌ని చెప్పారు. దీంతో త‌న‌ను తాను మ‌ల‌చుకోవ‌డానికి సిద్ధ‌మైంది.  అందుకు న‌మిత‌ ఓ కఠిన నిర్ణయం తీసుకుని, తన శరీర బరువును తగ్గించేందుకు జిమ్‌లో పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది.

అదేసమయంలో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం ఎక్కువ సమయాన్ని జిమ్‌లోనే గడుపుతోంది. తాజాగా ఆమె తన కసరత్తులు చేసే ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో వైరల్‌ కావడంతో నమిత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.