శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:52 IST)

అమెరికా వాయుసేన అదుర్స్.. రోబో జాగిలాల ప్రయోగం సక్సెస్

ROBO Dogs
అమెరికా వాయుసేన ఇటీవల రోబో జాగిలాలను విజయవంతంగా పరీక్షించింది. భవిష్యత్తులో మాన రహిత యుద్ధాలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రోబోలతో పాటూ, కృత్రిమ మేథ వంటి అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే రోబో జాగిలాలను పరీక్షించింది.
 
వాయుసేన స్థావరాలను ఎలా రక్షించాలనే వ్యూహంపై ఏర్పాటు చేసిన యుద్ధ విన్యాసాలలో భాగంగా అమెరికా వాయు సేన రోబో జాగిలాలను రంగంలోకి దింపి వాటి పనితీరును ముదింపు వేసింది. యుద్ధరంగానికి సంబంధించిన అన్ని దృశ్యాలను రోబో జాగిలం రికార్డు చేసి సైనికులకు పంపిందని వాయు సేన ఓ ప్రకటనలో తెలిపింది.
 
విమానాల రక్షణ కోసం ఉన్న సైనికులు తామున్న చోట నుంచి కదలకుండానే జాగిలాలు అందించిన చిత్రాల ద్వారా యుద్ధ క్షేత్రంపై పూర్తి అవగాహనకు వచ్చారని తెలిపింది. నెల్లిస్ ఎయిర్ బేస్‌లో ఈ అధ్యయనం జరిగింది.