బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (10:23 IST)

పవన్ కల్యాణ్ కోసమే ఫిదా రాసుకున్నా.. షాడోలా వెనక నుంచి నడిపించాడు..

జనసేన పార్టీ నేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఫిదా స్టోరీ రాసుకున్నట్లు శేఖర్ కమ్ముల అన్నాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రం హిట్ అయిన నేపథ్యంలో, ఫిదా మూవీ కథను మహేష్ బాబుకు శేఖర్ కమ్ముల వి

జనసేన పార్టీ నేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఫిదా స్టోరీ రాసుకున్నట్లు శేఖర్ కమ్ముల అన్నాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రం హిట్ అయిన నేపథ్యంలో,  ఫిదా మూవీ కథను మహేష్ బాబుకు శేఖర్ కమ్ముల వినిపించాడట. కానీ ఆ కథను రాసుకున్నది మాత్రం మహేష్‌ను దృష్టిలో పెట్టుకొని కాదని.. కేవలం.. పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫిదా కథ రాసుకున్నట్లు శేఖర్ కమ్ముల తెలిపాడు. 
 
కథ రాసుకున్నప్పుడు వెనక నుంచి ఓ షాడోలా పవన్ కల్యాణ్ తనను నడిపించారని శేఖర్ కమ్ముల తెలిపారు. ఆయన చేసిన ఖుషి సినిమా ఛాయలు, ఫిదా సెకెండాఫ్‌లో కనిపిస్తాయని తెలిపాడు. అందుకే ఫిదా సినిమాను పవన్ కల్యాణ్‌తో తీద్దాం అనుకున్నానని శేఖర్ కమ్ముల తెలిపాడు. అయితే పవన్‌తో ఆ సినిమా చేయలేకపోయానని,.. అయినప్పటికీ వరుణ్ తేజ్ ఫిదాలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు.