మే 1న ఘనంగా ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలు
Anil Kumar Vallabhaneni, Tammareddy Bhardwaj and others
మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్బంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రసిడెంట్ కొల్లి రామకృష్ణ, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లతో పాటు ఫెడరేషన్ కు సంబందించిన మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇటీవలే ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొల్లి రామకృష్ణ ను ఫెడరేషన్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా కార్మిక దినోత్సవం బ్రోచర్ ని ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ విడుదల చేయగా, ఈవెంట్ టీ షర్ట్ లను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు.
ఈ సందర్బంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్ అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క లతో పాటు ఎపి కి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పదివేలమంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఇపుడు చేయడానికి ముఖ్య కారణం ఉంది అది ఏమిటంటే.. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ దాన్నుంచి బయటకొచ్చారు. కరోనా సమయంలో చాలా మంది కార్మికులను కోల్పోయాము, అప్పట్లో సినిమా రంగంలో ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉండేవారు.. కానీ ఆ తరువాత చిరంజీవి గారు నేనున్నా అంటూ మాకు సపోర్ట్ అందిస్తున్నారు . ముక్యంగా కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికి మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమలో ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. కార్మికుల్లో చాలా మంది సొంత ఊర్లకు వెళ్లిపోయారు, కొందరు మరణించారు.. అలాంటి వారికి మేమున్నాం అని చాటి చెప్పేలా ఈ వేడుక జరుగుతుంది. చాలా గ్రాండ్ గా జరిగే ఈ వేడుకలో పలువురు స్టార్స్, పాల్గొంటారు. మా కార్మికుల్లో ఒకరిగా ఉన్న కొల్లి రామకృష్ణ గారు ఈ రోజు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను ఫెడరేషన్ తరపున అభినందిస్తున్నాము. మేము జరపబోతున్న ఈ వేడుకకు సినిమా రంగంలోని అన్ని క్రాఫ్ట్స్ ముక్యంగా నిర్మాతల మండలి సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నాను, ఈ రోజు తెలుగు పరిశ్రమ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాయి. ఆ గొప్ప గొప్ప సినిమాల వెనక మాలాంటి కార్మికులు ఉన్నారని చెప్పే ప్రయత్నం ఇదే. మా కార్మికుల కుటుంబాలు మొత్తం కలిసి కట్టుగా ఉండాలని చాటి చెప్పే ప్రయత్నం . తప్పకుండా ఈ వేడుకను అందరు కలిసి జయప్రదం చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఫెడరేషన్ ఎప్పటినుండో ఈ మే డే వేడుకలు నిర్వహిస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ వేడుకల్లో యాభై మందికి మించి పాల్గొనలేదు.. కానీ ఈ సారి ఫెడరేషన్ కొత్త టీమ్ చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్రయత్నం చేస్తుంది. కరోనా తరువాత చాలా మంది పరిస్థితి మారిపోయింది. నిజంగా కరోనా సమయంలో పరిశ్రమ ఎంతో కోల్పోయింది.. ఆ సమయంలో చిరంజీవి గారు సీసీసీ ద్వారా కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి మేలు చేసారు. అందుకే కార్మికులంతా ఒక్కటే అని చాటి చెప్పేలా చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ .. నేను సౌండ్ ఇంజనీర్ గా మెడ్రాస్ లో కెరీర్ మొదలుపెట్టి 20 సంవత్సరాలుగా పనిచేసాను. ఆ తరువాత ఆడియోగ్రఫీ శాక అధ్యక్షుడిగా ఇరవై ఏళ్ళు ఉన్నాను, ఆ తరువాత ఛాంబర్ అఫ్ కామర్స్ లో మెంబర్ గా ఉపాధ్యక్షుడిగా పనిచేసాను.. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయినందుకు ఆనందంగా ఉంది. ఈ సారి మే డే వేడుకలను నిర్వహించేందికి ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నారు. నేను అనీల్ కలిసి చాలా కాలం పనిచేసాను. అనిల్ ఏమిటో నాకు తెలుసు. అనిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నా ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఈ వేడుకకు పెద్దన్న చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారంటే నిజంగా మనందరికీ పండగ. ఈ పండగను చాలా గ్రాండ్ గా జరుపుకోవడానికి నిర్మాతల మండలి తరపున నా సపోర్ట్ ఉంటుంది అన్నారు.
ప్రధాన కార్యదర్శి పీఎస్ ఎన్ దొరై మాట్లాడుతూ .. మే డె వేడుకలను భరద్వాజ అన్నగారి ఆధ్వర్యంలో చాలా చేసారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడిగా భరద్వాజ అన్నగారు ఉన్నారు. ఈ వేడుకలు ప్రతి ఏడాది చేస్తూనే ఉన్నారు.. కానీ ఈ సారి మాత్రం పదివేల మంది కార్మికుల మధ్య ఈ వేడుక జరపాలని మా ఆలోచన. అందుకే ఈ కార్యక్రమం గొప్పగా చేయాలనీ ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఈ వేడుకలో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.