శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (11:20 IST)

'అజ్ఞాతవాసి'కి కష్టాలు... నోటీసులివ్వనున్న ఫ్రెంచ్ దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే కాపీ రైట్ వివాదం వెంటాడుతోంది. ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ చిత్రా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే కాపీ రైట్ వివాదం వెంటాడుతోంది. ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ చిత్రానికి పక్కా కాపీ అంటూ పలువురు సినీ విమర్శకులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు జెరోమ్ సాలీ కూడా 'అజ్ఞాతవాసి' చిత్రం విడులైన తర్వాత చిత్రాన్ని చూసి తన చిత్రం కాపీయే అజ్ఞాతవాసి అని స్పష్టం చేశారు. 
 
అయితే, సినిమా విడుదలై వారం రోజులు దాటినా, తన ఆరోపణలపై స్పందన రాలేదని ఆరోపించిన ఆయన, ఇక చర్యలు తీసుకోవడం ఒక్కటే తన ముందున్న మార్గమని, లీగల్ నోటీసులు పంపనున్నానని ఫ్రెంచ్ దర్శకుడు స్పష్టం చేశారు. "కాపీ కొట్టకుండా క్రియేటివిటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ చిత్ర పరిశ్రమకు ఉందనే భావిస్తున్నాను. అయితే, గత వారం రోజులుగా 'అజ్ఞాతవాసి' టీమ్ నుంచి మౌనమే సమాధానమైంది. ఇక చట్టపరమైన చర్యలకు దిగనున్నా" అని జెరోమ్ సాలీ తన ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించారు.