శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 16 జనవరి 2018 (14:34 IST)

రాజమండ్రిలో సినిమా థియేటర్ గేటెక్కి దూకి పారిపోయిన హీరో సూర్య... ఎందుకు?

తమిళ అగ్ర నటుడు సూర్య చిత్రం గ్యాంగ్ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సూర్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న రాజమండ్రి వెళ్లాడు. అక్కడ ఓ థియేటర్లో అభిమానులతో కలిసి చిత్రాన్ని చూసేందుకు వచ్చాడు.

సినిమా ప్రారంభమైందో లేదో... అభిమానులు సూర్యకు సినిమా చూపించారు. అంతా కలిసి ఒక్కసారిగా సూర్య వద్దకు వచ్చి సెల్ఫీలనీ, ఆటోగ్రాఫ్‌లంటూ మీదపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా చేతులెత్తేసారు. అంతా ఒక్కసారిగా మీదకు వచ్చి సూర్యను అభిమానంతో నలిపేశారు. అభిమానుల టార్చర్ తట్టుకోలేక థియేటర్ గేట్లెక్కి దూకి పారిపోయాడు సూర్య.