శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (17:30 IST)

గ్యాంగ్‌స్టర్ గంగరాజు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది

Laksh, Chadalwada Srinivas, Ishan Surya, Venue Datta, Sai Karthik
Laksh, Chadalwada Srinivas, Ishan Surya, Venue Datta, Sai Karthik
హీరో లక్ష్. 'వలయం' సినిమా త‌ర్వాత‌ ఇప్పుడు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. 

నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో రామారావు గారు, నాగేశ్వర రావు వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశాము. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. దాదాపు పదిహేను సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. వీటిలో గ్యాంగ్ స్టార్ గంగరాజు సినిమా ఒకటి. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. కొత్తవారు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. దర్శకుడు సినిమా ను ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు.  అందరు నటీనటులు చాలా బాగా చేశారు. జూన్ 24 న రాబోతున్న ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. తమిళ్ లో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవుతుంది అన్నారు.  
 
హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ..  జయసుధ గారి అబ్బాయి నిహార్ ఈ సినిమా లో నటించడం ఆనందంగా ఉంది. నటి సత్య కృష్ణ గారి కూతురు కూడా ఈ సినిమా తో పరిచయం అవుతున్నారు. ఎంతో మంది కొత్తవాళ్లు ఈ సినిమా లో నటించారు. మా టీం అందరూ ఎంతో పక్కాగా ప్లాన్ చేయడం  వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ గారితో వర్క్ చేయడం చాలా అదృష్టం. నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ ఇషాన్ సూర్య  మంచి టాలెంటెడ్. ఈ సినిమా ను ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. హీరోయిన్ వేదిక తో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమాలో అన్ని అంశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరు ఈ సినిమా ను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. హీరో లక్ష్ కి మంచి భవిష్యత్తు ఉంది. పెద్ద బ్యానర్ లో సినిమా చేయడం ఎప్పుడు ఆనందమే. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. తప్పకుండా అందరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది అన్నారు. 
 
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు మంచి ప్రతిభావంతుడు. ఆయనతో ఎప్పటికీ పని చేయాలని కోరుకుంటున్నాను. హీరో లక్ష్ తో పనిచేయడం చాలా బాగా అనిపించింది. వరుసగా ఆయనతో రెండో సినిమా కూడా  చేయబోతు ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నారు. 
 
హీరోయిన్ వేదిక దత్త మాట్లాడుతూ..   తెలుగు లో ఇది నా మొదటి సినిమా. హీరో లక్ష్ తో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా లో నా పాత్ర కొత్తగా వెరైటీ గా ఉంది. ఈ సినిమా నాకు ఎంతో కీలకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇషాన్ గారి చాలా థాంక్స్.  తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది. ప్రేక్షకుల ఆశీస్సులు సినిమా పై ఉంటాయని ఆశిస్తున్నాను.. అన్నారు. 
 
దర్శకుడు ఇషాన్ సూర్య మాట్లాడుతూ.. ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకం. నేను దర్శకుడిగా ఇలా ఉండటానికి కారణం హీరో లక్ష్ ఆయన కు ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి పెద్ద బ్యానర్ లో దర్శకుడిగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ  ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా తో వస్తున్నందుకు గర్వంగా ఉంది. అందరు ప్రేమతో పనిచేశారు. అందుకే ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చింది. తప్పకుండా అందరిని ఈ సినిమా అలరిస్తుందని నమ్ముతున్నాను.