శనివారం, 2 డిశెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (13:54 IST)

లక్ష్మీదేవితో పాటు గుడ్లగూబ నిలబడి ఉన్న ఫోటోను పూజగదిలో పెట్టవచ్చా?

Godess Lakshmi
Godess Lakshmi
పూజ గదిలో ఉంచకూడని వస్తువులు ఏమిటనే దానిపై వాస్తు నిపుణులు ఏం చెప్తున్నారంటే..? ప్రతి రోజూ పూజ గదిని శుభ్రం చేసిన తరువాతే భగవంతున్ని పూజించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. అలాగే మన పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉంటే వెంటనే తొలగించాలి. 
 
అలాగే విరిగిపోయిన, చిరిగిపోయిన ఫోటోలను, ప్రతిమలను మనం పూజ గదిలో ఉంచకూడదు. అలా పగిలిపోయిన వాటిని వెంటనే పారే నీటిలో వేయాలి. 
 
ఇంట్లో ఎండిపోయిన తులసి మొక్కను ఉంచుకోకూడదు. తులసి మొక్క ఎండిపోతే ఆ మొక్కను వెంటనే తొలగించి ప్రవహిస్తున్న నీటిలో వేయాలి. మన ఇంట్లో ఉన్న తులసి మొక్కకు ప్రతి రోజూ పూజ చేయడం చాలా మంచిది. అలా వీలు కానీ పక్షంలో ప్రతి శుక్రవారమైనా పూజ చేయాలి. 
 
అలాగే ఇద్దరు భార్యలు ఉన్న వినాయకుడి ఫోటోను కానీ, ప్రతిమను కానీ పూజ గదిలో ఎప్పుడూ పెట్టుకోకూడదు. అలాగే వినాయకుడిని తులసీ దళంతో పూజించరాదు. 
 
అదే విధంగా ప్రతి ఇంట్లో సీతారాముల ఫోటో, పార్వతి పరమేశ్వరుల ఫోటో, లక్ష్మీ నారాయణుల ఫోటో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోటోలను పూజ గదిలో ఉంచుకోవడం వల్ల భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు.
 
మన పూజ గదిలో లక్ష్మీ దేవి నిలబడి ఉన్న ఫోటోను కానీ, లక్ష్మీ దేవితో పాటు గుడ్లగూబ నిలబడి ఉన్న ఫోటోను కానీ పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు ఉన్న ఫోటోను మాత్రమే పూజ గదిలో ఉంచుకోవాలి. ఈ ఫోటోకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయాలి. 
 
మన పూజ గదిలో కేవలం శ్రీరామ పట్టాభికేషం ఫోటోను మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అలాగే మన పూజ గదిలో శాంత స్వరూపంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోను ఉంచుకోవాలి.
 
ఇంట్లో పగిలిన గాజు వస్తువులను కూడా ఉంచుకోకూడదు. శివుడి ఫోటోను ఇంట్లో ఉంచుకుంటే తప్పకుండా బిల్వ పత్రాలతో పూజ చేయాలి. అలాగే శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్షు కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.