కృష్ణ పుట్టినరోజున వైభవంగా జరిగిన ఘట్టమనేని అభినవ కృష్ణ పంచల వేడుక
Superstar Krishna, Abhinava Krishna, K. Raghavendra Rao, Ashwaneedath
సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీ తులసి, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబుల మనవడు చి. ఘట్టమనేని అభినవ కృష్ణ పంచల వేడుక కార్యక్రమం మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ ఎన్ సీసీ లో వైభవంగా జరిగింది.
Superstar Krishna, Abhinava Krishna
ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, డా. మోహన్ బాబు, కృష్ణంరాజు సతీమణి శ్యామల, ప్రముఖ దర్శకులు పి.సాంబశివరావు, సాగర్, ప్రముఖ నిర్మాతలు సి. అశ్వనీదత్ జి .ఆదిశేషగిరిరావు, కెయస్ రామారావు, కె.యల్.నారాయణ, యస్.గోపాలరెడ్డి, యన్ రామలింగేశ్వరరావు, పద్మాలయ మల్లయ్య, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, తదితర ఆత్మీయ కుటుంబ సభ్యులు పాల్గొని చి. అభినవ్ కృష్ణను ఆశీర్వదించారు..
Superstar Krishna, Raghavendra Rao
ఇదే వేడుకపై సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని భారీగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా బావమరిది అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు పద్మావతి ఫిలిమ్స్ పతాకంపై మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి, రామ్ రాబర్ట్ రహీం, శంఖారావం, బజార్ రౌడి, వంటి చిత్రాలతో పాటు ఇంకా ఇరవై కి పైగా చిత్రాలను నిర్మించారు..
Superstar Krishna, sister tulasi and her family
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో హిందీలో రెండు, కన్నడలో అంబరీష్ తో రెండు చిత్రాలు నిర్మించారు. ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల కొంత కాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న సూర్యనారాయణ బాబు త్వరలో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.