గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 మే 2022 (15:53 IST)

మంచి ఆరోగ్యంతో వుండాలి మీరు - మ‌హేష్‌బాబు

Trivikram Srinivas, Mahesh Babu, Superstar Krishna
Trivikram Srinivas, Mahesh Babu, Superstar Krishna
సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు మే 31 అయిన మంగ‌ళ‌శారంనాడు ఆయ‌న కుటుంబీకులు పలుర‌కాలుగా స్పందించారు. మ‌హేష్‌బాబు అందుబాటులో లేక‌పోవ‌డంతో సందేశం వెలిబుచ్చారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! మీలాంటి వారు నిజంగా ఎవరూ లేరు. రాబోయే చాలా సంవత్సరాలు మీ సంతోషాన్ని & మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఆశీర్వాదంతో ఉండండి. ప్రేమిస్తున్నాను.. అంటూ పోస్ట్ చేశారు. ఇదిలా వుండ‌గా, కృష్ణ కుటుంబీకులంతా ఒకేచోట చేరి లంచ్ చేయ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు చెప్ప‌లేని ఆనందంతో శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.
 
త్రివిక్ర‌మ్ శుభాకాంక్ష‌లు 
 
ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ త‌న‌దైన శైలిలో కృష్ణ‌గారికి శుభాకాంక్ష‌లు ఇలా తెలియ‌జేశారు. మ్యాన్ బిహైండ్ ఫ‌స్ట్ ఈస్ట్‌మన్‌కలర్ ఫిల్మ్,ఫ‌స్ట్  సినిమాస్కోప్ ఫిల్మ్, ఫ‌స్ట్ సినిమా స్కోప్ ఫిల్మ్, ఫ‌స్ట్  70 ఎంఎం .. 350+ సినిమాలు ప్రధాన నటుడిగా, 17 సినిమాలు దర్శకుడిగా .. పద్మభూషణ్ శ్రీకృష్ణ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు..అంటూ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కృస్ణ‌, మ‌హేష్‌తో వున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.