మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జులై 2018 (10:43 IST)

కమల్ హాసన్‌పై గాయత్రి రఘురాం ఫైర్.. మహిళలు సిగరెట్లు కాల్చితే తప్పేముంది?

తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ లెజెండ్ కమల్ హాసన్‌పై గత ఏడాది బిగ్ బాస్ తమిళం తొలి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వ్యవహరించిన సినీనటి గాయత్రి రఘురామ్ మండిపడింది. పురుషులతో కలిసి ఒకే మంచంపై నిద్

తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ లెజెండ్ కమల్ హాసన్‌పై గత ఏడాది బిగ్ బాస్ తమిళం తొలి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వ్యవహరించిన సినీనటి గాయత్రి రఘురామ్ మండిపడింది. పురుషులతో కలిసి ఒకే మంచంపై నిద్రించడం.. అభ్యంతరకరంగా ప్రవర్తించడం, లేడీ సెలబ్రిటీలు సిగెరెట్లు కాలుస్తుండటాన్ని కమల్ హాసన్ తప్పుబట్టారు. 
 
మహిళలు సిగరెట్లు తాగడమేంటని, మగవారు చేసే పనులను మహిళలు చేయరాదని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఈ సందర్భంగా కమల్, మహిళా కంటెస్టెంట్‌లకు హితవు పలికారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఇటీవల ప్రసారమైంది. దీనిపై గాయత్రి స్పందిస్తూ.. ఆడవారు సిగరెట్లు తాగితే తప్పేముందని అడిగింది. మగవారి కంటే గొప్పవాళ్లమని చెప్పుకునేందుకు ఆడవారు సిగరెట్లు కాల్చడం లేదని.. వారికి మానసిక ఒత్తిడి మనోవేదన వుంటాయని.. ఆ కారణంగానే సిగరెట్లు కాలుస్తారని చెప్పింది. 
 
ధూమపానం అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడేనని, మగవారు గొప్పవారని, స్త్రీలు వారిని కాపీ కొడుతున్నారన్న ధోరణిలో కమల్ మాట్లాడడం తప్పంటూ గాయత్రి మండిపడింది. తమిళ బిగ్ బాస్ తొలి సీజన్‌లో కమల్-గాయత్రిల మధ్య పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో గాయత్రి చేసిన హంగామా అంతా ఇంతా కాదన్న విషయం తెలిసిందే.