మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (13:37 IST)

''బిల్డప్ బాబాయ్''కి భలే డిమాండ్..

జబర్దస్త్ షో నటీనటులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ షోల ద్వారా సినిమాల్లోకి వెళ్లే నటులు పెరిగిపోతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ టీమ్‌లో ఒకడైన గెటప్ శీనుకు మంచి డిమాండ్ పెరిగిపోతుంది. ఇతనికి ఇప్పటికే మంచి ఫాలోయింగ్ వుంది. ఇటీవల బిల్డప్ బాబాయ్ స్కిట్ యూట్యూబ్‌లో హిట్ కావడంతో.. అతనికి సినీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ముఖ్యంగా ఈ స్కిట్‌లో గెటప్ శీను సాంగ్‌కి విపరీతమైన ప్రేక్షకాదరణ పెరిగింది. అందరూ ఈ పాటను డబ్ స్మాష్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. గెటప్ శీను కూడా ఈ సాంగ్‌ని పలు సందర్భాల్లో పలు స్టేజ్‌ల మీద ప్రదర్శించాడు. 
 
ప్రస్తుతం ఎన్నారై అసోసియేషన్స్ అమెరికా, లండన్ వంటి దేశాల్లో అదే పాట కోసం గెటప్ శీనుతో షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోల కోసం గెటప్ శీను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.