1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (17:00 IST)

దెయ్యాలనే భయపెట్టే పాత్రలో తాప్సీ: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ ట్రీట్..

తాప్సీ మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అదీ భయపెట్టే పాత్రలో. రాఘవ లారెన్స్‌తో కాంచన సీక్వెల్‌లో హారర్ మూవీలో నటించిన అనుభవం ఉన్న తాప్సీకి.. తెలుగులో హారర్ మూవీలో నటించాలనే ఆఫర్ వచ్చింది. మహి కె.ర

తాప్సీ మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అదీ భయపెట్టే పాత్రలో. రాఘవ లారెన్స్‌తో కాంచన సీక్వెల్‌లో హారర్ మూవీలో నటించిన అనుభవం ఉన్న తాప్సీకి.. తెలుగులో హారర్ మూవీలో నటించాలనే ఆఫర్ వచ్చింది. మహి కె.రాఘవ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దెయ్యాల్నే భయపెట్టే పాత్రలో తాప్సీ నటించనున్నట్టు తెలిసింది. 
 
ఝుమ్మంది నాదంతో తెలుగు సీమకు పరిచయమైన తాప్సీ... ఆపై అగ్ర హీరోలతో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు సాధించలేకపోయింది. తెలుగు నేర్చుకుని తెలుగమ్మాయిలా మాట్లాడింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో ఆమెకు అవకాశాలు లభించలేదు. దాంతో హిందీ చిత్రసీమపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌ నుంచి ముంబైకి మకాం మార్చింది. అక్కడ వరుసగా అవకాశాలు అందుకొంటూ బిజీ అయిపోయింది. తాజాగా తెలుగు సినిమా కోసం సంతకం చేసేసింది.