బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (15:47 IST)

రమణ గోగుల, మధు ప్రియ ఆలపించిన గోదారి గట్టు పాట రిలీజ్

Venkatesh, Aishwarya Rajesh
Venkatesh, Aishwarya Rajesh
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా అలరించిన రొమాంటిక్ ట్రాక్ సంక్రాంతికి వస్తున్నాంలో ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్ అయింది. భాస్కరభట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదాలని అందంగా ప్రజెంట్ చేసింది. వారు షేర్ చేసుకునే ఆప్యాయత, ప్రేమను ప్రదర్శిస్తూనే, ఒక బాండింగ్ లో హ్యుమరస్ ఆర్గ్యుమెంట్స్ ని హైలైట్ చేస్తుంది. ఈ పాట జానపదం టచ్ ని కలిగి ఉంది, భీమ్స్ సిసిరోలియో అద్భుతంగా కంపోజ్ చేశారు.  రమణ గోగుల యూనిక్ స్టయిల్ మెలోడీకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. మధు ప్రియ మెస్మరైజ్ చేసే వాయిస్ పాట ఆకర్షణను మరింత పెంచింది.
 
అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'తో అలరించబోతున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్లు మేకర్స్ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ విడుదల చేయడంతో ప్రారంభమయ్యాయి.
 
వెంకటేష్ , ఐశ్వర్య రాజేష్ భార్యభర్తలుగా బ్యూటీఫుల్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నారు. గోదారి గట్టు సాంగ్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు బ్లాక్‌బస్టర్ బిగినింగ్ అందిస్తూ ఆల్బమ్‌లోని తర్వాతి పాటలపై అంచనాలు పెంచింది
 
షూటింగ్ పూర్తి కావస్తున్న ఈ ట్రైయాంగిల్ క్రైమ్ కథలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.