ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:14 IST)

కథను చూసి వెళుతున్నామండీ సినిమాకు: నమస్కరించిన విజయేంద్రప్రసాద్

కథకోసం సినిమా చూసే ోజులు ఎప్పుడో పోయాయి. హీరో, వాడి కులం, వాడి వర్గం, వాడి అహం చుట్టూ పేరుకున్న అభిమానుల కోలాహలంతో సినిమాలకు వెళుతున్న రోజులు వచ్చేశాయి. అలాంటిది ఎన్నాళ్లకు తెలుగు ప్రేక్షకులు తాము కథ కోసం సినిమాకు పోతున్నామని చెబుతున్నారు? కథాబలమున్న

కథకోసం సినిమా చూసే ోజులు ఎప్పుడో పోయాయి. హీరో, వాడి కులం, వాడి వర్గం, వాడి అహం చుట్టూ పేరుకున్న అభిమానుల కోలాహలంతో సినిమాలకు వెళుతున్న రోజులు వచ్చేశాయి. అలాంటిది ఎన్నాళ్లకు తెలుగు ప్రేక్షకులు తాము కథ కోసం సినిమాకు పోతున్నామని చెబుతున్నారు? కథాబలమున్న చిత్రాలకు బళ్లు కట్టుకుని పోయి మరీ చూసిన ఆ తెలుగు సంప్రదాయం మళ్లీ ఇన్నేళ్లకు బాహుబలి2 రూపంలో వచ్చేసింది. 
 
బాహుబలి2 విడుదల సందర్భంగా శుక్రవారం ఒక టీవీ మీడియాతో ముఖాముఖీలో పాల్గొన్న బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ కళ్లు చమర్చేలా ప్రశ్నలడిగిన పాఠకులు తాము కథకోసం బాహుబలి2 సినిమాకు పోతున్నామని చెప్పడం వీనులవిందుగా అనిపించింది. తెలుగు సినిమా కథను ఏనాడో మర్చిపోయి హీరో, దర్శకుల చుట్టూ అంటకాగుతూ ఉన్న నేపథ్యంలో సరైన కథ ఉంటే ఆ సీనిమా ఎన్ని అద్బుతాలను సృష్టిస్తుందో బాహుబలి నిరూపించింది. 
 
అందుకే తాము హీో కోసమే, దర్శకుడికోసమో, పాటల తైతక్కల కోసమో బాహుబలి కోసం పోవడం లేదని, కథను చూసి పోతున్నామని పాఠకులు చెప్పడంతో అంతటి విజయేంద్రప్రసాద్‌కు కళ్లు చమర్చాయి. అలాగే నమస్కారం పెట్టేశారు. 
 
థాయ్‌లాండ్‌కు, సింగపూర్‌కు పోయి బీచ్‌లో కూర్చోకపోతే కథ పుట్టదని చెప్పే దొడ్డ దర్శకులు ఒకసారి ఈ మాటలను ఆలకిస్తే బాగుంటుందేమో..