శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (13:07 IST)

HBDSamantha, సమంత మధురు జ్ఞాపకాలు, ఫస్ట్ ఫోటో పవన్ కళ్యాణ్, ఏంటి అవి?

Attarintiki Daaredi
స‌మంత అక్కినేని పుట్టిన‌రోజు ఈరోజే. ఈ సంద‌ర్భంగా ప‌లువురు అభిమానులు, స్నేహితులు ఆమె ఫొటోల‌ను పెడుతూ సోష‌ల్‌మీడియాలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక స‌మంత నిన్న‌నే నాలుగు ఫొటోలు పెట్టి మ‌ధుర జ్ఞాప‌కాలు అంటూ పోస్ట్ చేసింది. ఇదే ఆ ఫొటో. ఇంకోవైపు నిన్న రాత్రి పూట (అంటే తెల్లారితో 28) మూడు ర‌కాల కేక్‌ల‌ను క‌ట్‌చేసి చిన్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ కేక్‌ను క‌ట్ చేసి త‌నే తిన్న‌ది.
 
Cake cutting
ఇదిలా వుండ‌గా, సమంత పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె కామన్ డీపీని మిల్కీ బ్యూటీ తమన్నా ట్వీట్ చేసింది. పలువురు కథానాయికలూ ఆ సీడీపీని ట్వీట్ చేయడం మొదలెట్టారు. వీరిద్ద‌రూ సామ్‌జామ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఇక సమంత మంచి నటి మాత్రమే కాదు గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. తన వంతు సాయం ఆపన్నులకు అందిస్తూ వస్తోంది. తన కిష్టమైన ఫ్యాషన్ డిజైన్ రంగంలోకీ అడుగుపెట్టింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కరోనా టైమ్ లో దృష్టి పెట్టింది. 
 
Samantha Akkineni
ఇంకోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి న‌టించిన అత్తారింటికి దాదేరి సినిమాలో స‌మంత న‌టించింది. ఆ షూట్ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమాని త‌నుకూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పేరుతో సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ,, సిస్ట‌మ్ ఆల్‌ది బెస్ట్‌. హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ ట్వీట్ చేశాడు. ప‌వ‌న్ చేతితో ఆశీర్వ‌దిస్తూన్న‌ట్లు స‌మంత కింద కూర్చున్న ఫొటో అది. అత్తారింటికి దాదేరి సినిమాలో ఓ స‌న్నివేశంలో మ‌త్తులోకి వెళ్ళిన స‌మంత‌, ఆ త‌ర్వాత జ‌రిగే స‌న్నివేశంలో వ‌స్తుంది.
 
Samantha memories
కాగా, స‌మంత ప్ర‌స్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ  చిత్రంలో నటిస్తున్నది. కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో 'శాకుంతలమ్'లో నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. మొన్న‌టివ‌ర‌కు అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ప్ర‌స్తుతం కోవిడ్ సెకండ్‌వేవ్ సంద‌ర్భంగా గేప్ ఇచ్చారు.