ఉజ్జయినీ మహా కుంభమేళాలో గ్రేసీ సింగ్ క్లాసికల్ డ్యాన్స్ అదుర్స్..!
లగాన్, సంతోషం సినిమాల్లో నటించిన గ్రేసీ సింగ్ క్లాసికల్ డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. మోహన్‌బాబు నటించిన 'తప్పు చేసి పప్పుకూడు' అనే సినిమాతో గ్రేసీ సింగ్ మంచి మార్కులు కొట్టేసిన గ్రేసీ సింగ్ ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్ అనే విషయం తెలిసిందే. తాజాగా ఉజ్జయినీ మహా కుంభమేళాలో క్లాసికల్ డాన్స్ పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుని అదరహో అనిపించుకుంది.
సినీ ప్రేక్షకుల మధ్య ప్రస్తుతం గ్రేసీ సింగ్ పేరు మార్మోగిపోతోంది. ఉజ్జయినిలో అమ్మడు చేసిన డాన్స్ ప్రేక్షకులను అలరించింది. అంతేగాకుండా సినిమాల్లో వచ్చిన గుర్తింపు కంటే, స్టేజ్ పెర్ఫామెన్స్ తనకెంతో ఆత్మసంతృప్తినిచ్చిందని గ్రేసీ సింగ్ వెల్లడించింది. దేవుడి కోసం పెర్ఫామ్ చేయడం, లక్షలాది మంది భక్తుల మధ్య ఆ పెర్ఫామెన్స్ ఇవ్వడం పూర్వ జన్మ సుకృతమని గ్రేసీ సింగ్ అంటోంది.
నటి శోభన కూడా సినిమాల్లో నటించడం తగ్గించేసి, స్టేజ్ పెర్ఫామెన్స్‌లతో తనలోని డాన్సింగ్ టాలెంట్‌ని ప్రపంచానికి చాటుతోంది. బాలీవుడ్ నుంచి మాధురీ దీక్షిత్, హేమమాలిని వంటి హేమాహేమీలు అప్పుడప్పుడూ స్టేజ్ పెర్ఫామెన్స్‌లతో తళుక్కున మెరుస్తుంటారు. ప్రస్తుతం గ్రేసీ సింగ్ స్టేజ్ ప్రదర్శన ద్వారా మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవకాశమొస్తే తెలుగులో మళ్లీ నటిస్తానని చెప్తోంది.