సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 మే 2022 (18:09 IST)

ఘనంగా ఐపిఎల్ మూవీ టిజర్ లాంచ్

IPL movie team
IPL movie team
బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్. ఈ సినిమా టిజర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. టిజర్‌ను హీరో సుమన్ రిలీజ్ చేశారు
 
ఈ సందర్భంగా నిర్మాత చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ: ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. విశ్వ కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అలాగే మా సినిమా అల్లంత దూరాన మూవీ లో కూడా విశ్వ కార్తికేయ హిరో ఈ నెలలోనే విడుదల కాబోతుంది .
 
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ: విశ్వ కార్తికేయ, శరణ్ ఇద్దరు మంచి నటులు వారికి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది వేంగి మ్యూజిక్ చాలా బాగున్నాయి ఇండస్ట్రీలో పెద్ద స్థాయిలో కి వెళ్తాడు.నిర్మాత ఎప్పుడు  చిరు నవ్వుతో వుంటారు. దర్శకుడు పెద్ద దర్శకుడు అవుతాడు ఈ టీమ్ కి అల్ ది బెస్ట్ అని అన్నారు.
 
నిర్మాత డీ ఎస్ రావు మాట్లాడుతూ: నిర్మాత బీరం శ్రీనివాస్ గత పాతిక సంవత్సరాలుగా సినిమా మార్కెటింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ గా వున్నారు నేను ఎప్పుడూ చిన్న హీరోల తోనే సినిమా లు చేశాను.ఈ సినిమా హీరోలు విశ్వ కార్తికేయ శరణ్ లు కూడా పెద్ద హీరోలు అవుతారు. కొత్తగా సినిమాలు చేసే వారిని తప్పకుండా ఎంకరేజ్ చెయ్యాలి. ఈ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఇద్దరు హీరోలు కోడె దూడలు లాగా వున్నారు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్నారు
 
ఏం ఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ చౌదరి  మాట్లాడుతూ: విశ్వ కార్తికేయ సినిమాలు చూసాను.ఈ సినిమాలో నటించిన హీరోలు ఇద్దరు కూడా భవిష్యత్ లో పెద్ద హీరోలుగా అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు
 
హీరోయిన్ అర్చన గౌతమ్ మాట్లాడుతూ: ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ లో నటించాను.నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు 
 
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ : ఐపీఎల్ మూవీ లాక్ డౌన్ టైం లో స్టార్ట్ చేసాము. ఈ సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని అనుకున్నాను కానీ నిర్మాత పట్టుదల తో చేసారు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అని అన్నారు
 
శరణ్ మాట్లాడుతూ : ఇప్పుడు సౌత్ సినిమా నేషనల్ లెవెల్ లో వుంది.ఈ మూడు నెలల్లో ఎంటర్ టైన్ మెంట్ రంగం లో చాలా మార్పులు వచ్చాయి విశ్వ కార్తికేయ నాకు మంచి ఫ్రెండ్.దర్శకుడు ఎంతో ఫెషన్ తో సినిమాను తెరకెక్కించారు. పాటలు బాగా వచ్చాయి. మానిర్మత ఎంతో మంచి వారు అందరికీ థాంక్స్ అన్నారు
 
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ: నా పేరెంట్స్ కి స్పెషల్ థాంక్స్ ఐపీఎల్ మూవీ లో నటించే అవకాశం డి ఎస్ రావు గారి వల్ల వచ్చింది. దర్శకుడు సురేష్ స్తాయిలిష్ డైరెక్టర్. అతనికి టేకింగ్ లో స్టైలిష్ ఎలిమెంట్ నచ్చుతుంది .శరణ్ తో ఫస్ట్ ఎలా ఉంటాడో అని భయ పడ్డాను కానీ ఎంతో బాగా కలిసిపోయాడు. హీరోయిన్స్ అర్చన అవంతిక ఇద్దరు బాగా నటించారు.ఈ సినిమా లో నటించిన అందరికీ థాంక్స్ అని అన్నారు.
 
హిరో సుమన్ మాట్లాడుతూ: నాకు విశ్వ కార్తికేయ అతని తండ్రి రామాంజనేయులు గారు ఎప్పటి నుంచో తెలుసు.మంచి మనిషి. విశ్వ కార్తికేయ ను చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా చేయాలని అతనికి అన్ని విద్యలు నేర్పించి మంచి యాక్టర్ గా తీర్చిదిద్దారు ఈ సినిమా లో చాలా ట్విస్ట్ లు వున్నాయి.అందరికీ నచ్చుతుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి సాంగ్స్ ఇచ్చాడు వేంగి.దర్శకుడు కి సినిమా పట్ల ఎంతో ఫేషన్ వున్నవాడు. వెల్ మెచ్యుర్డ్ డైరెక్టర్ గా చేశాడు నిర్మాత కు చాలా డబ్బు రావాలి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు ఐపీఎల్ అనే టైటిల్ చాలా క్యాచి టైటిల్ .ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు
 
చిత్ర దర్శకుడు సురేష్ లంకల పల్లి మాట్లాడుతూ: దేశం మీద వున్న ప్రేమే ఈ సినిమా. ఆ ప్రేమ ఎంతో బలమైనది. వేంగి నాతో మూడూ సంవత్సరాల నుంచి ప్రయాణం సాంగ్స్ ఎంతో మంచివి ఇచ్చాడు నేను కారులో వెళ్తూ కూడా అవే పాటలు వింటాను. ఇద్దరు హీరోయిన్లు బాగా నటించారు.నిర్మాత బాగుంటే అందరం బాగుంటారు.ఎవ్వరికీ అప్పు లేకుండా ఈ సినిమాని పూర్తి చేసాము.సినిమాని జూలై లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు.
 
చిత్ర నిర్మాత బీరం శ్రీనివాస్ మాట్లాడుతూ: మేము పిలవగానే మా సినిమా టీమ్ ను ఆశీర్వదించడానికి వచ్చిన అటిధులందరికి కృతజ్ఞతలు. టిజర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతకు మించి వుంటుంది. ప్రేక్షకులకు మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమా లో వున్నాయి.ఈ సినిమాలో నటించిన నటి నటులకు టెక్నిషియన్స్ కు థాంక్స్. ఐ పి ఎల్ సినిమాను జూలై లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.
 
విశ్వ కార్తికేయ, శరణ్, అర్చన్ గౌతమ్, అవంతిక, హిరో హీరోయిన్లు....సుమన్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, డిఎస్ రావు,అమిత్, మిర్చి మాధవి, కిన్నెర,,ఈరోజుల్లో సాయి, రచ్చ రవి, రామ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
 
  సంగీతం: వెంగి సినిమాటోగ్రఫీ: AK ఆనంద్ ఎడిటర్: జానకి రామ్
ఆర్ట్: వెంకట్
కొరియోగ్రాఫర్: పోలాకి విజయ్
యాక్షన్: సతీష్, డ్రాగన్ ప్రకాష్
కాస్ట్యూమ్స్: ఆనంద్
 ప్రొడక్షన్ కంట్రోలర్: రామాంజనేయులు
కో డైరెక్టర్; తిరుమల కుమార్ నిర్మాత: బీరం శ్రీనివాస్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సురేష్ లంకలపల్లి.