శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (14:17 IST)

'బాహుబలి' స్టోరీ వీక్... కానీ కథను తెలివిగా మలిచి కళాఖండంగా చేశారు : గుణశేఖర్ ట్వీట్

'బాహుబలి 2' చిత్రంపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ అభిప్రాయాలను ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.శంకర్ మొదలుకుని, 'రుద్ర‌మ‌దేవి' వంటి చారిత్ర‌క సినిమాను అందించిన క్రియే

'బాహుబలి 2' చిత్రంపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ అభిప్రాయాలను ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.శంకర్ మొదలుకుని, 'రుద్ర‌మ‌దేవి' వంటి చారిత్ర‌క సినిమాను అందించిన క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌వరకు, సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలుకుని హీరో నాని వరకు ఇలా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
అయితే, గుణశేఖర్ చేస్తున్న ట్వీట్లు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలికి సంబంధించి ఒక్కో రోజు, ఒక్కో విభాగం గురించి గుణ‌శేఖ‌ర్ ట్వీట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా, బాహుబలికి క‌థ అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ను ప్ర‌శంసిస్తూ గుణశేఖర్ ట్వీట్ చేశారు. 
 
"విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారూ, మీకు అభినంద‌న‌లు. ఫిల్మ్ మేకింగ్‌లో త్రీడీ, ఐమాక్స్‌, వీఆర్‌.. ఇలా ఎన్ని టెక్నాల‌జీలు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. హ్యూమ‌న్ ఎమోష‌న్స్ అనేవే సినిమాకు ప్ర‌ధాన బ‌లం అని మ‌రోసారి నిరూపించారు. క‌థ చాలా సింపుల్‌గా అనిపించొచ్చు, కానీ, బ‌ల‌మైన క్యారెక్ట‌రైజేష‌న్ల‌తో ఆ క‌థ‌ను తెలివిగా మ‌ల‌చిన తీరు వ‌ల్లే బాహుబ‌లి ఓ క‌ళాఖండంగా నిలిచింది. మీ డైలాగ్ రైట‌ర్లు అజ‌య్‌, విజ‌య్‌లు రాసిన డైలాగులు ఎమోష‌న్ల‌ను అద్భుతంగా క్యారీ చేశాయ‌ని ఆయన ట్వీట్లు చేశారు.