గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 23 జనవరి 2025 (15:51 IST)

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

student
అనంతపురంలోని నారాయణ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవనం యొక్క మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసి కెమెరాలో రికార్డైంది. నారాయణ కళాశాలలో ఉదయం 10:15 గంటలకు విద్యార్థి తరగతి గది నుండి బయటకు వెళ్లి, భవనం పిట్టగోడ పైకి ఎక్కి మూడవ అంతస్తు నుండి దూకేశాడు.
 
తరగతి జరుగుతుండగా బాలుడు గది నుండి బయటకు వెళ్లినట్లు వీడియోలో కనబడుతోంది. నేరుగా క్లాస్ రూం నుంచి బైటకొచ్చి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.