ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (15:27 IST)

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

Helmet with Balakrishna
Helmet with Balakrishna
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మించిన భారీ అంచనాల చిత్రం డాకు మహారాజ్. ఈరోజు గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురంలో జరగనుంది. 22 జనవరి, 2025 సాయంత్రం 5 గంటల నుండి శ్రీనగర్ కాలనీ, 80FT రోడ్డు, అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద జరగనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ సందర్భంగా బాలక్రిష్ణ అభిమానులను, ప్రజలనుద్దేశించి హెల్మెట్, సీటు బెల్ట్ ల గురించి కొద్దిసేపు మాట్లాడారు.
 
తప్పు మనది కాకపోవచ్చు. అవతలివారిది కావచ్చు. ఒక్కోసారి తప్పు మనదే కావచ్చు. ఏదైనా మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. లేదంటే ప్రాణమే పోతుంది. అందుకే అన్నీ పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రతి పౌరుడూ తమ బాధ్యతగా వ్యవహించాలి. సరైన రూల్స్ పాటించకపోతే కఠిన నిర్ణయాలు ప్రభుత్వం, ఇటు పోలీసులు తీసుకుంటారు. లైసెన్స్ రద్దు చేయడం కూడా జరుగుతుంది. 
 
ఈమధ్య పాశ్చాత్య సంస్క్రుతి మీద వేసుకుని విచ్చలవిడిగా బైక్ పై ఫీట్లు చేయడం,  అర్థరాత్రి ఇష్టానుసారంగా చేస్తున్నారు. అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం కూడా తగు చర్యలు తీసుకుంటుంది. అన్ని చోట్ల కెమెరాలు పెట్టింది. అందరికీ విన్నపం ఏమంటే,  రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు రూల్స్ పాటించండి అని ఉద్భోధించారు.
 
ఈ రోజు రాత్రికి డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ పూర్తవనుంది. కనుక ఇండ్లకు తిరిగి ప్రయాణం చేసేవారు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు గుర్తుచేసుకుని సేఫ్ గా ఇళ్ళకు వెళ్ళండి. మీ కోసం మీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదుచూస్తుంటారని బాలక్రిష్ణ సూచించారు.