ఫారిన్ బాయ్‌ఫ్రెండ్ చేతిలో చెయ్యేసి తళుక్కుమన్న ఇలియానా: రుస్తుం సక్సెస్‌తో ఖుషీ
పోకిరీ భామ ఇలియానాను బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆమెకు గతంలో బ్రేకప్‌లు అయిన సంగతీ అందరికీ తెలుసు. కానీ లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఆతడి ముఖం ఎలా ఉంటుందో ఇప్పట
పోకిరీ భామ ఇలియానాను బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆమెకు గతంలో బ్రేకప్‌లు అయిన సంగతీ అందరికీ తెలుసు. కానీ లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఆతడి ముఖం ఎలా ఉంటుందో ఇప్పటివరకు సస్పెన్స్. అయితే ఆ సస్పెన్స్ వీడింది.
ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చేతిలో చేయేసి నడిచిన దృశ్యం కెమెరాకు చిక్కింది. ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ తళుక్కుమన్నారు. తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఈ గోవా భామ ముంబయి విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కింది. నీబోన్ చేతిని పట్టుకుని నడిచి వెళ్తూ.. ఆయనతో తన అనుబంధం ఏమిటో అందరికీ ఎత్తిచూపింది.
కాగా అక్షయ్ కుమార్‌తో నటించిన రుస్తుం సక్సెస్ కావడంతో ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ అయిన నీబోన్‌తో ఇలియానా ఫారిన్ ట్రిప్పేసింది. ఈ ట్రిప్ నుంచి ముంబైకి వస్తూ వస్తూ తన బాయ్ ఫ్రెండ్‌ను కూడా వెనకేసుకొచ్చింది. ఈ జంటను చూసినవారంతా ఇల్లీకి నీబోన్ సరైన జోడీ అని.. ఈడుజోడు బాగుందని మాట్లాడుకున్నారు. ఎనీవే త్వరలో నీబోన్‌ను ఇల్లీ పెళ్ళిచేసుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..!