శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (13:45 IST)

HBD మాధవన్: చాలా "నిశ్శబ్ధం"గా నా పుట్టినరోజు గడపాలి..

Madhavan
కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వ‌న్ పుట్టినరోజు నేడు. గ‌తేడాది నిశ్శ‌బ్దం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మాధ‌వ‌న్ 51వ ప‌డిలోకి అడుగుపెడుతున్నాడు. త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్న మాధవన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో కోవిడ్‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్న నేప‌థ్యంలో తన పుట్టినరోజును జరుపుకోవద్దని అభిమానులను అభ్య‌ర్థించాడు. 
 
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.  ప్ర‌స్తుతం మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. నా పుట్టినరోజు జరుపుకోవడాన్ని నేను ఊహించలేను. ఈ సంద‌ర్భంగా నేను చాలా నిశ్శబ్దంగా, నా దగ్గరి వారితో గడపాలని కోరుకుంటున్నాను ఫ్యాన్స్‌కు తెలియ‌జేశాడు. 
 
మాధవన్‌ బహుముఖ ప్రజ్ఞకు ప్రశంసలు అందుకుంటున్నాడు. 90వ దశకంలో దియా మీర్జా సరసన రెహ్నా హై తేరే దిల్ మెయిన్ చిత్రంతో ఈ నటుడు అరంగేట్రం చేశాడు. 3 ఇడియట్స్, గురు, తనూ వెడ్స్ మను కొన్ని నటుల ప్రసిద్ధ సినిమాలు. ఈ నటుడు ఈ రోజు తన 51 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది అతని లుక్స్, పవర్‌ప్యాక్ నటన మాత్రమే కాదు, మాధవన్‌కు బలమైన అభిమానుల సంఖ్యను సంపాదించి పెట్టింది.