గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (14:21 IST)

ప్రేమికుల రోజుకు ముందుగానే నితిన్ వివాహం.. రుక్మిణి మెడలో మూడుముళ్లు వేయనున్నాడోచ్!

ప్రేమికుల రోజుకు ముందుగానే నితిన్ పెళ్లి కొడుకు కానున్నాడు. నితిన్ వివాహం ఫిబ్ర‌వ‌రి 9న అట్టహాసంగా జరుగనుంది. పెళ్లికి త‌క్కువ టైమే ఉండ‌డంతో పెళ్లి ప‌నుల వ్య‌వ‌హారం ఊపందుకున్నాయి. అయితే నితిన్ అనేసరిక

ప్రేమికుల రోజుకు ముందుగానే నితిన్ పెళ్లి కొడుకు కానున్నాడు. నితిన్ వివాహం ఫిబ్ర‌వ‌రి 9న అట్టహాసంగా జరుగనుంది. పెళ్లికి త‌క్కువ టైమే ఉండ‌డంతో పెళ్లి ప‌నుల వ్య‌వ‌హారం ఊపందుకున్నాయి. అయితే నితిన్ అనేసరికి ఈ వార్త టాలీవుడ్ హీరో నితిన్‌కు సంబంధించింది కాదు. బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ వివాహం గురించి. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో నీల్ నితిన్ ముఖేష్ ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా జ‌రిగింది. 
 
బాలీవుడ్ అప్‌క‌మింగ్ ఆర్టిస్ట్ రుక్మిణి స‌హాయ్‌తో నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుకకు అత్యంత ఆప్తులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. రుక్మిణిస‌హాయ్‌-నీల్ నితిన్ ముఖేష్‌ది పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే. బాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ కిశోర్ కుమార్‌కి నితిన్ మ‌నువ‌డు. ఇటు, రుక్మిణి స‌హాయ్ కుటుంబానికి కూడా బాలీవుడ్‌తో సంబంధాలున్నాయి. దీంతో, రెండు ఫ్యామిలీలు ఈ మ్యాచ్‌ని ఫైన‌లైజ్ చేశాయి. అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న ఈ మ్యారేజ్‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తోపాటు ప‌లువురు రాజ‌కీయ నేత‌లు కూడా హాజ‌రుకానున్నారు.
 
బాలీవుడ్‌లో హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్‌.. సౌత్‌లో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం విజ‌య్‌-మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీలో ఖ‌ల్‌నాయ‌క్ నితినే. ఇదే ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150గా రీమేక్ అయింది.