మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (14:27 IST)

మలయాళలో సినీ అవకాశాలు కావాలంటే సన్నిహితంగా మెలగాల్సిందే.. హేమ కమిషన్ నివేదిక

bride kiss
మలయాళ చిత్రపరిశ్రమలో సినిమా అవకాశాలు రావాలంటే మహిళలకు అడ్జెస్ట్‌మెంట్ (సన్నిహితంగా) కావాల్సిందేనంటూ జస్టిస్ హేమ కమిషన్ రూపొందించిన నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టులో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. 
 
పలువురు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నివేదికలో వెల్లడైన కొన్ని షాకింగ్ అంశాలివే.. దుస్తులు మార్చుకునేందుకూ ఇబ్బందే.. సినీ పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు అక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని నివేదిక పేర్కొంది. దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సినిమా చిత్రీకరణ ప్రదేశాల్లో టాయిలెట్లు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 
 
ముఖ్యంగా, సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలు/మహిళలకు.. కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతారు. అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ లభిస్తుందట. లైంగిక సాన్నిహిత్యంతోపాటు 'అడ్జెస్ట్‌మెంట్', 'కాంప్రమైజ్' అనే పదాలు మలయాళం ఇండస్ట్రీలో సర్వసాధారణమని కమిటీ గుర్తించింది. అలాగే, సినిమా షూటింగ్ సమయంలో మహిళలు బసచేసే హోటల్ గదులకు పురుషులు మద్యం మత్తులో వచ్చి తలుపు తడుతుంటారు. వాటిని తెరిచేవరకూ.. బలవంతంగా, డోర్లు పగిలేలా శబ్దాలు చేస్తారు. మహిళా నటులు ఒంటరిగా ఉండేందుకు జంకుతారని, అందుకే తమ కుటుంబీకులు, స్నేహితులతో షూటింగ్‌లో వస్తుంటారని పేర్కొంది.