సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (18:40 IST)

దువ్వాడ శ్రీనివాస్ ఆలనా.. పాలనా నేనే చూసుకున్నా : దివ్వల మాధురి

divvela madhuri
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండిళ్ల పంచాయతీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తన భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కుమార్తెలకు దూరంగా తన సన్నిహితురాలు దివ్వల మాధురి నివాసంలో ఉంటూ వచ్చారు. ఈ వ్యవహారం ఇటీవలే బహిర్గతమైంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, ఆయన పెద్ద కుమార్తె హైందవి కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఉండే ఇంటివద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో ఈ గుట్టు రట్టయింది. ఈ పరిస్థితుల్లో దివ్వల మాధురి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. 
 
ఇంతకాలంలేని భయం, ప్రాణహాని ఇపుడు ఎందుకు కలుగుతుందని ప్రశ్నించారు. తనవల్ల దువ్వాడకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఆలనా పాలనా తానే చూసుకున్నట్టు చెప్పారు. గత రెండేళ్లుగా లేని థ్రెట్‌ ఇప్పుడే వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. దువ్వాడను చంపడానికి వాణి ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పది మందిని తీసుకొచ్చి తలుపులు పగులగొట్టారని, ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసని దివ్వల మాధురి అన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు ఇచ్చానని, వాణి తన డబ్బు చెల్లించి ఇంటిని తీసుకోవచ్చని మాధురి పేర్కొన్నారు.