బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (10:19 IST)

హీరోయిన్ భావనపై లైంగిక దాడి వెనుక హీరో... పాత వైరమే కారణం?

ప్రముఖ మలయాళ కథానాయికపై లైంగిక దాడి కేసులో ఓ హీరో హస్తమున్నట్టు తెలుస్తోంది. రౌడీ షీటర్‌ సునీల్‌ కుమార్‌తో కుమ్మక్కై వాళ్లే ఈ పని చేయించినట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కథానాయికపై దాడ

ప్రముఖ మలయాళ కథానాయికపై లైంగిక దాడి కేసులో ఓ హీరో హస్తమున్నట్టు తెలుస్తోంది. రౌడీ షీటర్‌ సునీల్‌ కుమార్‌తో కుమ్మక్కై వాళ్లే ఈ పని చేయించినట్టుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కథానాయికపై దాడి చేసిన తర్వాత సునీల్‌ కుమార్‌ సినీ పరిశ్రమలోని కొంతమందితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా పరిశీనలో తేలింది. ఈ మేరకు పోలీసులకు ఆధారాలు లభించాయి. దాంతో, సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. 
 
హీరోయిన్‌పై లైంగిక దాడి వెనక నేరపూరిత కుట్ర ఉందని మరో నటి మంజు వారియర్‌ ఆరోపించారు. అదికూడా, ఈ ఘటనకు వ్యతిరేకంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలోనే ఆమె ఈ విమర్శలు చేశారు. అలాగే, ‘‘కేరళ సినీ పరిశ్రమ మాఫియా గుప్పిట్లో ఉంది. లైంగికదాడికి గురైన హీరోయిన్‌కు ఓ హీరోతో వైరం ఉంది. దాంతో ఆమె సినీ పరిశ్రమలో వివక్షకు గురవుతోంది. ఆ హీరోతో శత్రుత్వానికి, దాడికి ఏమైనా సంబంధం ఉందేమో విచారించాలి’’ అని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు వి.మురళీధరన్‌ వ్యాఖ్యానించారు.