ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:35 IST)

సినిమాలకు రామ్ బ్రేక్, ఎందుకో తెలుసా?

Hero Ram potineni
ఎనర్జిటిక్ హీరోగా పేరుపొందిన రామ్ ‌ పోతినేని ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా వుంటున్నాన‌ని పోస్ట్ చేశాడు. శివ‌రాత్రి సంద‌ర్భంగా 41 రోజులు దీక్ష తీసుకుంటున్న‌ట్లు తెలియ‌జేస్తున్నాడు. శివుని మాలను వేసుకోవడంతో 41 రోజుల పాటు దీక్ష ఉండాలని అందుకనే రామ్‌ కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకోవాలని అనుకున్నాడు.

తాను శివుని మాలతో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన రామ్‌, "ఓం నమః శివాయ, చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. మళ్లీ వస్తాను" అంటూ మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి `రెడ్‌` సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రామ్‌ తదుపరి సినిమా ఏంటనే విషయంపై అధికారిక సమాచారం లేదు. మరి బ్రేక్‌ తర్వాత ఈ విషయంపై రామ్‌ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

కాగా, ఇప్ప‌టికే రెడ్ సినిమాలో రెండు పాత్ర‌లు పోషించి మెప్పించాడు. అంత‌కుముందు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా చేశాడు. ఆ చిత్రం ఊహించ‌ని విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాకు ఏ సినిమాకూ ప‌డ‌నంత క‌ష్ట‌ప‌డ్డాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అప్పుడే కాస్త విరామం తీసుకోవాల‌నుకున్న‌ట్లు తెలియ‌జేశాడు. వెంట‌నే స్వంత బేన‌ర్‌లో రెడ్ చేయాల్సి వ‌చ్చింది. అనుకోకుండా క‌రోనా లాక్‌డౌన్‌కూడా రావ‌డంతో ఈ సినిమా ఆల‌స్య‌మైంది. ఈ శివ‌దీక్ష అప్పుడే అనుకున్న‌ట్లు తెలియ‌జేస్తున్నాడు.