బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (13:12 IST)

నాన్ లోకల్ అంటూ బురద చల్లుతున్నారు.. ప్రకాష్ రాజ్ సరైన అభ్యర్థి : హీరో శ్రీకాంత్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అభివృద్ధి కోసం ఎంతో చేశామనీ, కానీ ఉద్దేశ్యపూర్వకంగానే కావాలనే కొందరు తమపై బురద చల్లుతున్నారంటూ హీరో శ్రీకాంత్ ఆరోపించారు. 
 
మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రముఖ సినీన‌టుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున ఉపాధ్యక్షుడుగా శ్రీకాంత్, బెనర్జీలు పోటీ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మా' అభివృద్ధి ప్రకాశ్‌రాజ్‌ వల్లే సాధ్యమవుతుందని అన్నారు.  
 
కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగానే సినీ పరిశ్రమలో నాన్ లోక‌ల్ అని మాట్లాడుతున్నార‌ని చెప్పారు. తెలుగువారంటే మిగతా పరిశ్రమల్లో కూడా గౌరవం ఉందన్నారు. తాము మా అసోసియేషన్ కోసం ఎంత చేసినప్ప‌టికీ త‌మ‌పై కొంద‌రు బురద చ‌ల్లుతున్నారని ఆయ‌న తెలిపారు.
 
ఈ కార‌ణం వ‌ల్లే తాను ఈసారి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నానని, అయితే, ఆరు నెలల క్రితం ప్రకాశ్‌రాజ్ త‌న‌ను కలిశార‌ని, ఓ ప్రణాళిక గురించి వివరించారని తెలిపారు. మా అభివృద్ధి ఆయ‌న వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు.
 
పోటీ చేయాల‌ని ఆయన అడగటం వల్లే తాను ఈ సారి పోటీ చేస్తున్నాన‌న్నారు. తాను గ‌త‌ ఎన్నికల్లో ఓడిపోలేదని, త‌న‌ను ఓడించారని ఆయ‌న వ్యాఖ్యానించారు. అందుకే ఓట‌మి పాలైన చోటే కసితో పని చేద్దామని నిర్ణయించుకున్నాన‌ని చెప్పారు. మా శాశ్వత భవనం కల‌ను ప్రకాశ్‌రాజ్  నెరవేర్చుతార‌ని తెలిపారు.