ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (16:43 IST)

బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు కేన్సర్!!

hina khan
బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు కేన్సర్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రముఖ టీవీ సీరియల్ 'ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై'తో ఆమె ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, దీని నుంచి ఖచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉందని ఆమె సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చారు. అభిమానులు తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. 
 
మరోవైపు, హీనాఖాన్‌ పోస్ట్‌పై తోటి నటులు, అభిమానులు స్పందిస్తూ.. మీపై ప్రేమాభిమానాలు, గౌరవం ఎప్పటికీ ఉంటాయని, త్వరగా కోలుకొని మా ముందుకురావాలని పోస్టులు పెట్టారు. బాలీవుడ్‌ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనాఖాన్ ఒకరు. ప్రముఖ టీవీ సీరియల్ 'ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై'లో ఆమె పోషించిన అక్షర పాత్ర ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు పొందింది. అంతేకాకుండా హీనా బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నారు. 
 
కాగా, గతంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన హీరోయిన్లు సొనాలీ బింద్రే, మహిమా చౌదరి, కిరణ్ ఖేర్, మనీషా కోయిరాలా, బాలీవుడ్ స్టార్ హీరోలు సంజయ్ దత్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, రాకేష్ రోషన్ తదితరులకు ఈ ప్రాణాంత కేన్సర్‌పై పోరాటం చేసి విజయం సాధించారు.