బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (14:37 IST)

పవన్ కల్యాణ్ ఓజీలో హాస్య నటుడు అలీ.. మళ్లీ ఆ కాంబో రిపీట్

Ali_Pawan
Ali_Pawan
హాస్యనటుడు అలీ ఇటీవల తెలుగు సినిమాకు దూరంగా వున్నాడు. రాజకీయాలకు కూడా దూరమైన అలీ.. త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో, అలీ తెలుగు సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. 
 
తాను పోషించే పాత్రల గురించి ఎక్కువగా సెలెక్టివ్‌గా తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. బడ్డీ, డబుల్ ఇస్మార్ట్‌లో తన అద్భుత నటనను అనుసరించి, సరిపోద శనివారంలో కనిపించబోతున్నాడు. 
 
అలీ ఇంతకుముందు అంటే సుందరానికి చిత్రంలో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఓజీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.