ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (17:50 IST)

హాలీవుడ్ నటిని కాల్చిచంపిన పోలీసులు.... ఎందుకో తెలుసా?

ప్రముఖ హాలీవుడ్ నటి వెనెస్సా మర్క్వెజ్‌ను పోలీసులు కాల్చి చంపారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బొమ్మ తుపాకీని ఆమె గురిపెట్టింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

ప్రముఖ హాలీవుడ్ నటి వెనెస్సా మర్క్వెజ్‌ను పోలీసులు కాల్చి చంపారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బొమ్మ తుపాకీని ఆమె గురిపెట్టింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన లాస్ ఏంజెల్స్‌లో జరిగింది.
 
లాస్ ఏంజెల్స్‌లోని పసడెనా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెనెస్సా ఒంటరిగా ఉంటోంది. గత కొంతకాలంగా వెనెస్సా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి మానసిక నిపుణులతో కలసి పోలీసులు చేరుకున్నారు.
 
తలుపు తెరవాలనీ, తాము సాయం చేసేందుకు వచ్చామని గంటన్నర సేపు అధికారులు అర్ధించారు. అయినా ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా లోపలకు వెళ్లారు. వెంటనే వెనెస్సా తన చేతిలో ఉన్న బొమ్మ తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టింది. దీంతో అధికారులు ఆమెపై కాల్పులు జరిపారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరికి ఆ తుపాకీని పరిశీలించిన పోలీసులు దాన్ని బొమ్మ తుపాకీగా గుర్తించారు.