బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (22:22 IST)

ధనుష్ ప్రాజెక్టులో హాలీవుడ్ స్టార్... ఇంత‌కీ ఎవ‌రా హాలీవుడ్ స్టార్...?

మరో హాలీవుడ్ సీనియర్ యాక్టర్ సౌత్ ఇండియన్ తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అనుష్క సైలెన్స్ సినిమాలో మైకేల్ మ్యాడ్సన్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ధనుష్ సినిమా ద్వారా మరో హాలీవుడ్ సీనియర్ యాక్టర్ సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
 
బ్రేవ్ హార్ట్ – ట్రాయ్ వంటి బిగ్గెస్ట్ హాలీవుడ్ సినిమాల్లో నటించిన జేమ్స్ కాస్మో నెక్స్ట్ ధనుష్ – డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నారు. జేమ్స్ కాస్మో గేమ్ ఆఫ్ త్రోన్స్‌లో కూడా నటించారు. 
 
ఇక ఫైనల్‌గా ఆయన ధనుష్ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. చాలా రోజులుగా ఈ విషయంపై వస్తున్న కథనాలను చిత్ర యూనిట్ స్పెషల్ ఫొటోతో క్లాటిటి ఇచ్చింది. వై నాట్ స్టూడియోస్ ఈ స్పెషల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.