మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (10:19 IST)

సిట్ విచారణకు హుషారుగా వచ్చిన రవితేజ.. జిషాన్‌తో ఆరేళ్ల సంబంధంపై ఏమంటారో?

టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణకుగాను ఆయన సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ విచా

టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణకుగాను ఆయన సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ విచారణకు వచ్చిన రవితేజ హుషారుగా కనిపించారు. అదే స్పీడులో సిట్ అధికారుల ముందుకు వచ్చారు. నవ్వుతూ సిట్ కార్యాలయానికి వచ్చారు. 
 
ఇక రవితేజ విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విచారణలో ముఖ్యంగా కెల్విన్, జిషాన్‌లతో ఉన్న సంబంధాలపైనే ప్రశ్నించనున్నట్టు సమాచారం. జిషాన్ తాను స్వయంగా రవితేజకు డ్రగ్స్ అందించినట్లు చెప్పడంతో పాటు రవితేజతో తనకు ఆరేళ్ల సంబంధం ఉన్నట్లు వెల్లడించడంతో.. రవితేజకు కష్టాలు తప్పవని సమాచారం. మరోవైపు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు రవితేజ ఆప్తమిత్రుడు కావడంతో, డ్రగ్స్ వ్యవహారంలో వీరిద్దరి సంబంధాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.
 
సిట్ కార్యాలయానికి బయల్దేరే ముందు కూడా రవితేజ తన లాయర్లతో కీలక చర్చలు జరిపారు. మరోవైపు, సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. ఇక గత రాత్రంతా ఓ స్టార్ హోటల్‌లో తన న్యాయవాదులతో చర్చలు జరిపిన హీరో రవితేజ, శుక్రవారం నిర్మాత నల్లమలుపు శ్రీనివాసరెడ్డి అలియాస్ బుజ్జికి చెందిన కారులో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.